రష్మిక కు మాజీ ప్రియుడు బర్త్ డే విషెస్Rakshit Shetty
2021-04-05 23:13:57

కన్నడ ముద్దుగుమ్మ రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్టేటస్ ను అనుభవిస్తోంది. రష్మిక కిరిక్ పార్టీ సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం తో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇదే సినిమాలో నటించిన రక్షిత్ శెట్టి తో రష్మిక ప్రేమాయణం కూడా నడిపించింది. అంతే కాకుండా వీరిద్దరికి ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. అయితే అప్పటికే రష్మీకకు టాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కట్టాయి. దాంతో ఇప్పుడే పెళ్లి వద్దనుకుందో ఏమో తెలియదు గానీ రక్షిత్ తో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని బ్రేకప్ చెప్పేసింది. 

అప్పటి నుండి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. అయితే తాజాగా రష్మిక పుట్టినరోజు సందర్భంగా కిరిక్ పార్టీ సినిమా కోసం రష్మిక ఆడిషన్ ఇచ్చిన వీడియోను పోస్ట్ చేసి రక్షిత్ బర్త్ డే విషెస్ చెప్పాడు. అంతే కాకుండా ఓ సుదీర్ఘమైన పోస్ట్ ను పెట్టాడు. "కిరిక్ పార్టీ సినిమా ఆడిషన్ కోసం నువ్వు ఇచ్చిన బ్యూటిఫుల్ ఆడిషన్ వీడియోను షేర్ చేస్తున్నా..నీ డ్రీమ్ ను నెరవేర్చుకునేందుకు నువ్వు ఎక్కడికో వెళ్లిపోయావు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నువ్వు జీవితంలో ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా.." అంటూ రక్షిత్ తన పోస్ట్ లో పేర్కొన్నాడు. ఇక రక్షిత్ చేసిన ట్వీట్ కు కన్నడ ప్రేక్షకులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

More Related Stories