రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి ఇంటిదైపోయిందిగా..rakul
2020-04-17 02:17:44

గాలి వచ్చినపుడే తూర్పు పట్టుకోవాలి అంటారు కదా.. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇదే చేస్తుంది. క్రేజ్ ఉన్నపుడే నాలుగు రాళ్లతో పాటు నాలుగు ఇళ్లు కూడా వెనకేస్తుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాలు చేస్తూనే మరోవైపు ఆస్తులు కూడా కూడ‌బెట్టుకుంటుంది. అందులోనూ కరిగిపోయేలా కాకుండా నిలిచిపోయేలా ఆస్తులు కొనేస్తుంది ఈ బ్యూటీ. అంటే ఇళ్లు, స్థలాలపై కాన్సట్రేట్ చేస్తుంది రకుల్. ఇప్పటికే హైదరాబాద్ లో ఇంటితో పాటు బిజినెస్ కూడా ఉంది. ఎఫ్45 చాలా ఫేమస్ కూడా. ఇదిలా ఉంటే ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ మరో ఇళ్లు కూడా కొనేసిందనే వార్తలు వస్తున్నాయి. అది కూడా ఇక్కడ కాదు.. అత్యంత ఖరీదైన బెంగ‌ళూరులో ఓ ఫ్లాటు కొనేసిందనే ప్రచారం జరుగుతుంది. అక్కడ ఓ ఖ‌రీదైన ప్ర‌దేశంలో 6 కోట్ల‌తో సొంత ఫ్లాటు తీసుకుందుని తెలుస్తుంది.

అక్క‌డ ర‌కుల్‌కి కొంత‌మంది స్నేహితులు ఉన్నారు. వాళ్ల సూచనలు, సలహాలతోనే బెంగళూర్ లాంటి సిటీలో ఫ్లాట్ తీసుకుంది ఈ ముద్దుగుమ్మ. కరోనా కారణంగా ప్రస్తుతం ఇంట్లోనే ఉన్న ఈ భామ.. ఇప్పుడు కూడా టైమ్ వేస్ట్ చేయడం లేదు. తన బిజినెస్ ప్లాన్స్ అన్నీ ఎలా పెంచుకోవాలో ఆలోచిస్తుంది. అంతేకాకుండా గుర్గావ్ లోని తన ఇంటి సమీపంలో ఉన్న వేలాది మంది పేదవారికి రోజూ అన్నం పెడుతున్నట్లు చెబుతుంది రకుల్ ప్రీత్ సింగ్. దాంతో పాటే బిజినెస్ చూసుకుంటుంది. హైద‌రాబాద్‌లో ర‌కుల్ సొంతంగా ఓ జిమ్ నిర్వ‌హిస్తోంది. ఇప్పుడు బెంగ‌ళూరులో కూడా ఎఫ్45 బిజినెస్ విస్తరించాలని కోరుకుంటుంది. మొత్తానికి చూడాలిక.. ఏం జరగబోతుందో..?

More Related Stories