రకుల్ రీఎంట్రీ...వికారాబాద్ అడవుల్లో సందడి Rakul Preet Singh
2020-10-18 13:05:26

డ్రగ్స్ కేసులో విచారణ తరవాత టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ షూటింగ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. క్రిష్ దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా గ్రామీణ నేపథ్యంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రకుల్ వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. లాక్ డౌన్ తరవాత ఈ సినిమా షూటింగ్ ను వికారాబాద్ అడవుల్లో మొదలు పెట్టగా డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా రకుల్ సడెన్ గా షూటింగ్ నుండి వెళ్ళిపోయింది. దాంతో షూట్ కి గ్యాప్ వచింది. ఇక విచారణ అనంతరం ఇటీవల హైదరాబాద్ చేరుకున్న రకుల్ తిరిగి షూటింగ్ లో పాల్గొంటుంది. 

వికారాబాద్ అడవుల్లో రకుల్ -వైష్ణవ్ తేజ్ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక షూటింగ్ జరుగుతుండటంతో వికారాబాద్ అడవుల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. హీరో హీరోయిన్ లను చూడడానికి సమీప గ్రామాల ప్రజలు భారీగా వస్తున్నారు. ఇదిలా ఉండగా సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ సినిమా విడుదలకు ముందే మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. వైష్ణవ్ తేజ్ నటించిన "ఉప్పెన" సినిమా లాక్ డౌన్ కారణంగా విడుదలకు నోచుకోలేదు. అయితే ఇప్పటికే విడుదల చేసిన "ఉప్పెన" సాంగ్స్ మాత్రం యువతను ఆకట్టుకున్నాయి. ఎక్కడ చూసినా ఉప్పెన సాంగ్స్ వినిపిస్తున్నాయి. అంతే కాకుండా రెండో సినిమాయే వైష్ణవ్ క్రేజీ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో నటించడం కూడా అతడి అదృష్టం అనే చెప్పవచ్చు.

More Related Stories