ర‌కుల్‌కు క‌రోనా నెగెటివ్



 Rakul Preet Singh
2020-12-29 13:04:03

కొద్ది రోజుల క్రితం క‌రోనా బారిన ప‌డిన ర‌కుల్ ప్రీత్ సింగ్ కు నెగెటివ్ వ‌చ్చిన‌ట్టు తెలియ‌జేసింది. స్వయంగా ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. నాకు క‌రోనా నెగెటివ్ వ‌చ్చింది. క్షేమంగా ఉన్నాను. మీ ప్రేమ‌, ఆద‌ర‌ణ‌కు ధ‌న్య‌వాదాలు. 2021ను పాజిటివ్ దృక్ప‌థంతో మొద‌లు పెట్టాల‌ని అనుకుంటున్నాను. ప్ర‌తి ఒక్క‌రు బాధ్య‌త‌గా ఉండి మాస్క్‌లు ధ‌రిస్తూ, భౌతిక దూరాన్ని పాటించాల‌ని కోరుతున్నాను అని ర‌కుల్ స్ప‌ష్టం చేసింది. అలాగే కరోనా నుంచి బయటపడడానికి అన్ని రకాల జాగ్రత్త తీసుకుంటున్నట్టు పేర్కొంది. అంతేకాదు శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేస్తూ చక్కటి పౌష్టికాహారం తీసుకుంటున్నా. వీటికి అనుబంధంగా విటమిన్‌ మాత్రలు కూడా వేసుకున్నా అని పేర్కొంది. 

More Related Stories