ర‌కుల్ ఆలోచ‌న‌లు మామూలుగా లేవుగా..rakul
2020-04-20 13:43:44

సినిమాల‌తో పాటు బిజినెస్ లో కూడా త‌న‌కు ఎవ‌రూ పోటీ కాద‌ని నిరూపించుకుంటుంది ర‌కుల్. అవ‌కాశాలు వ‌చ్చిన‌న్ని రోజులు బాగానే సినిమాలు చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు త‌న దృష్టి మొత్తం బిజినెస్ పైకి షిఫ్ట్ చేసింది. ముఖ్యంగా ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం అంటారు క‌దా.. అందుకే దీన్ని మించిన బిజినెస్ లేద‌ని ఆలోచిస్తుంది ఈ బ్యూటీ. అందుకే అన్ని వ్యాపారాలు ఆరోగ్యం చుట్టూనే తిప్పుతుంది. ఇప్ప‌టికే జిమ్ బిజినెస్ వ‌ర్క‌వుట్ అయింది. ఇప్పుడు ఫుడ్ బిజినెస్ కూడా మొద‌లు పెట్ట‌బోతుంది ఈ ముద్దుగుమ్మ‌. దీన్ని మించిన బిజినెస్ మ‌రోటి లేదు. స‌క్సెస్ అయితే డ‌బ్బులే డ‌బ్బులు.. పైగా ర‌కుల్ అనే బ్రాండ్ నేమ్ ఎలాగూ ఉంది. అందుకే అక్క‌డ కూడా సంచ‌ల‌నాలు రేపాల‌ను డిసైడ్ అయిపోయింది ర‌కుల్. అందుకే ఇదే త‌న బిజినెస్ గా మార్చుకుంది ర‌కుల్. దాంతో పాటే జిమ్ ఎలాగూ ఉంది. ఫిట్ నెస్ ఫ్రీక్ లో పీక్స్ చూపిస్తుంది ర‌కుల్. షూటింగ్స్ లేక‌పోతే రోజుకు 6 గంట‌లు జిమ్ లోనే గ‌డిపే ర‌కుల్.. జిమ్ బిజ‌నెస్ తోనే త‌న మార్కెట్ పెంచుకుంటుంది.

ఇప్ప‌టికే హైద‌రాబాద్ తో పాటు విజ‌య‌వాడ, బెంగ‌ళూరులోనూ ఫిట్ నెస్ బిజినెస్ మొద‌లుపెట్టింది. ఎఫ్ 45 పేరుతో ఇప్ప‌టికే ర‌కుల్ బిజినెస్ లోకి దిగింది. త‌న‌తో పాటు టాలీవుడ్ లో ఇంకా కొంద‌ర్ని కూడా ఈ బిజినెస్ లో పార్ట్ న‌ర్స్ గా చేసుకుంటుంది. ఇక ఆ మ‌ధ్య‌ కోకాపేట్ లోనూ మ‌రో బ్రాంచ్ ఓపెన్ చేసింది ర‌కుల్. ఇప్ప‌టికే గ‌చ్చిబౌలితో పాటు జూబ్లీహిల్స్ లోనూ ర‌కుల్ ఎఫ్ 45 జిమ్ లు ఉన్నాయి. ఇప్పుడు మ‌రో బ్రాంచ్ మొద‌లైంది. దీన్ని ఇలాగే ఒక్కొక్క‌టిగా పెంచుకుంటూ వెళ్లాల‌ని చూస్తుంది ర‌కుల్. ఇందులో క‌మ‌ర్షియ‌ల్ కంటే కూడా అంద‌రికీ ఆరోగ్యాన్ని ఇవ్వ‌డం అనే కాన్సెప్ట్ త‌న‌కు బాగా న‌చ్చిందంటోంది ర‌కుల్. మొత్తానికి ఈ భామ ఫిట్ నెస్ తో పాటు ఫుడ్ లోనూ దుమ్ము రేపాల‌ని ఫిక్సైపోయింది.

 

More Related Stories