రామ్ చరణ్ కు తోడళ్ళుడు కాబోతున్న శర్వానంద్ Ram Charan
2021-01-07 21:06:02

టాలీవుడ్ యంగ్ హీరోలు రామ్ చరణ్, శర్వానంద్ లు బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. శర్వానంద్ సినిమా ఆడియో ఫంక్షన్లకు చరణ్ రావడం సోషల్ మీడియాలో తన స్నేహితుడి సినిమాలకు సపోర్ట్ చేయడం చేస్తుంటాడు. శర్వానంద్ కూడా చరణ్ సినిమాలకు విష్ చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఈ బెస్ట్ ఫ్రెండ్స్ తొడల్లుళ్లు కాబోతున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. శార్వానంద్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 

ఇప్పుడు శర్వానంద్ చేసుకోబోయేది ఉపాసన కొణిదెల కజిన్ సిస్టర్ కామినేని అనుష్క అని వినిపిస్తోంది. ఈ పెళ్లికి ఇరు కుటుంబాలను ఉపాసన దగ్గరుండి ఒప్పించినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ పెళ్లికి రామ్ చరణ్ పెద్దగా వ్యవహరిస్తారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక త్వరలోనే ఈ పెళ్లిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతుందట. ఇక ఇప్పటికే యంగ్ హీరోలు రానా, నిఖిల్, నితిన్ లు పెళ్లి చేసుకుని ఓ ఇంటివారయ్యారు. ఈ లిస్ట్ లో త్వరలో శర్వా కూడా చేరిపోతున్నారు.

More Related Stories