ఆచార్య నుండి చరణ్ ప్రీ లుక్ విడుదలRam charan
2021-01-17 10:59:50

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో "ఆచార్య" సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కి ముందు కొంత వరకు పూర్తి చేసిన ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో చరణ్ కేవలం అతిథి పాత్రలో నటించడం లేదని సమాచారం. బ్రూస్లీ, మగధీర, ఖైదీ నంబర్ 150 సినిమాల్లా చిరు, చరణ్ లు కేవలం నిమిషాలపాటు కాకుండా ఆచార్య లో దాదాపు గంట పాటు తండ్రీకొడుకులు స్క్రీన్ పై మెరుస్తారట. దాంతో కూడా మెగా అభిమానులు పండగ చేసుకునే విషయమనే చెప్పాలి.

ఇదిలా ఉండగా తాజాగా "ఆచార్య" చిత్ర యూనిట్ సినిమాలో రామ్ చరణ్ ప్రీ లుక్ ను విడుదల చేసింది. "మా సిద్ధ సర్వం సిద్ధం" అంటూ కొరటాల శివ చరణ్ లుక్ ను ట్వీట్ చేసారు. దాంతో ఈ సినిమాలో చరణ్ సిద్ధ అనే పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రీ లుక్ లో చరణ్ చెవి పోగుతో కనిపిస్తున్నారు. ప్రస్తుతం చరణ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెగా అభిమానులు చరణ్ లుక్ ను ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఇక ప్రీ లుక్ కే ఇలా ఉంటే ఆచార్య ను రామ్ చరణ్ లుక్ మొత్తం రిలీజ్ చేస్తే రెస్పాన్స్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 

More Related Stories