ప్రధాని మోదీతో రామ్ చరణ్, చిరంజీవి భేటీ.. కారణమేంటో..?Ram charan
2019-11-01 17:40:29

ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య రాజకీయాలకు మళ్లీ దగ్గరవుతున్నాడు చిరంజీవి. తనకు పాలిటిక్స్ కు చాలా దూరం ఉందని చెబుతున్నాడు కానీ మళ్లీ పొలిటికల్ లీడర్స్ వైపు మాత్రం పరుగులు తీస్తున్నాడు. తాజాగా ఏకంగా ప్రధాన మంత్రి మోదీని కలవబోతున్నాడు మెగాస్టార్. తనయుడు రామ్ చరణ్ తో కలిసి త్వరలోనే ఈయన మోదీతో భేటీ కాబోతున్నాడని తెలుస్తుంది. ఈ మధ్యే తాను నటించిన సైరా సినిమాను పలువురు సినీ రాజకీయ ప్రముఖులకు ప్రదర్శించారు చిరంజీవి. ఈ క్రమంలోనే తెలంగాణ గవర్నర్ తమిళి సైతో పాటు ఏపీ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును కూడా కలిసాడు. అప్పుడే ప్రధాని మోదీని కూడా తన సినిమా చూడ్డానికి ఆహ్వానించాడు మెగాస్టార్. 

అయితే అప్పుడు ఎన్నికల బిజీలో ఉన్న మోదీ రాలేకపోయాడు. అయితే ఇప్పుడు మెగా హీరోలను మోదీ కలుస్తానని కబురు పంపించినట్లు తెలుస్తుంది. దీని వెనక మరో కథ కూడా నడుస్తుంది. మొన్నీమధ్యే మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఇండియన్ సినిమా సెలెబ్రిటీస్ కు విందు ఇచ్చాడు మోదీ. అందులో చాలా మంది టాలీవుడ్, బాలీవుడ్ నుంచి చాలా మంది ప్రముఖులు వచ్చారు కానీ ఈ కార్యక్రమంలో దక్షిణాది సెలెబ్రిటీస్ కు అన్యాయం జరిగిందని ఉపాసన ట్వీట్ చేసింది. సినీ పరిశ్రమ అంటే కేవలం ఉత్తరాది మాత్రమే కాదు.. సౌత్ కూడా ఉందని ప్రధాని గారు గుర్తించుకోవాలంటూ ట్వీట్ చేసింది ఈమె. దీనిపై బిజేపీ నేతలు కూడా సీరియస్ అయ్యారు. అయితే ఇప్పుడు మాత్రం సడన్ గా తాము వెళ్లి మోదీని కలుస్తామని.. ఆ మీటింగ్ కోసం ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నామని చరణ్ ఓ నేషనల్ మీడియాకు చెప్పినట్లు తెలుస్తుంది. దీనిపై ఇండస్ట్రీలో కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఇందులో ఏం మాట్లాడబోతున్నారు.. కేవలం సినిమా చూడ్డానికి ఆహ్వానిస్తున్నాడా లేదంటే ఇంకేమైనా విషయాలు చర్చకు వస్తాయా అనేది చూడాలిక.

More Related Stories