టాలీవుడ్‌పై చిరుత దాడికి 12 ఏళ్లు పూర్తి.. Ram Charan
2019-09-28 12:16:41

కాలం ఎంత వేగంగా గ‌డిచిపోతుందో..? రామ్ చ‌ర‌ణ్ అప్పుడే ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ప‌ద‌కొండేళ్లు పూర్తైపోయాయి. చిరుత‌తో ఈ చిరు త‌న‌యుడు వ‌చ్చి ద‌శాబ్దం పూర్తైపోయింది. ఈ 11 ఏళ్ల‌లో చ‌ర‌ణ్ చాలా అద్భుతాలు చేసాడు.. సాహ‌సాలు చేసాడు. 2007 సెప్టెంబ‌ర్ 28న చ‌ర‌ణ్ తొలి సినిమా చిరుత విడుద‌లైంది. చిరంజీవి త‌న‌యుడు అనే బాధ్య‌త‌.. భారీ అంచ‌నాలు.. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడు.. అశ్వినీ ద‌త్ లాంటి మెగా నిర్మాత‌.. మ‌ణిశ‌ర్మ అద్భుత‌మైన మ్యూజిక్.. ఇవ‌న్నీ చిరుత‌ను హిట్ చేసాయి. కోరుకున్న బ్లాక్ బ‌స్ట‌ర్ అయితే రాలేదు గానీ.. చ‌ర‌ణ్ కు సూప‌ర్ లాంచింగ్ ప్యాడ్ గా ఉప‌యోగ‌ప‌డింది చిరుత‌. ఈ సినిమా చ‌ర‌ణ్ కెరీర్ కు స‌రైన బేస్ వేసింది. 9 కోట్ల‌తో తెర‌కెక్కిన చిరుత 20 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసి.. అప్ప‌ట్లోనే మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్ గా నిల‌బ‌డింది. 

చిరుత త‌ర్వాత మ‌గ‌ధీర‌తో ఇండ‌స్ట్రీ రికార్డుల‌న్నీ తిర‌గ‌రాసాడు రామ్ చ‌ర‌ణ్. ఏడేళ్ల కిందే ఏకంగా 80 కోట్ల షేర్ వ‌సూలు చేసాడు రామ్ చ‌ర‌ణ్. రెండో సినిమాతోనే త‌న స్టామినా ఏంటో చూపించాడు. ఇక త‌న‌కున్న మాస్ ఇమేజ్ ప‌క్క‌న‌బెట్టి ఆరెంజ్ లాంటి క్యూట్ ల‌వ్ స్టోరీలో ఒదిగిపోయాడు. అయితే ఈ సినిమా చ‌ర‌ణ్ ఆశ‌ల్నినిల‌బెట్ట‌లేదు. ఆ త‌ర్వాత ర‌చ్చ‌, నాయ‌క్, ఎవ‌డు లాంటి మాస్ సినిమాల‌తో విజ‌యాలు అందుకున్నాడు. మ‌ధ్య‌లో జంజీర్ రీమేక్ తో బాలీవుడ్ కు కూడా వెళ్లొచ్చాడు చ‌ర‌ణ్. ఈ సినిమా డిజాస్ట‌ర్ గా నిలిచింది. 

గోవిందుడు అంద‌రివాడేలేతో ఫ్యామిలీ ఆడియ‌న్స్ కు చేరువ‌య్యే ప్ర‌య‌త్నం చేసాడు చ‌ర‌ణ్. ఇది కొంత వ‌ర‌కు స‌క్సెస్ అయింది కూడా. రెండేళ్ల కింద చేసిన వ‌చ్చిన బ్రూస్లీతో నిరాశ‌ప‌రిచాడు. ఇక రెండేళ్ల కింద ధృవ‌తో త‌న‌లోని మార్పును ప్రేక్ష‌కులకు చూపించాడు. ఈ చిత్రం ప‌ర్లేద‌నిపించింది. ఇక ఈ ఏడాది రంగ‌స్థ‌లం సినిమాతో న‌టుడిగానూ ఎన్నో మెట్లెక్కాడు చ‌ర‌ణ్. ఈ సినిమా 125 కోట్ల షేర్ వ‌సూలు చేసి ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాసింది. ప్ర‌స్తుతం హీరోగా, నిర్మాత‌గా రెండు పాత్ర‌ల్లోనూ బిజీగా ఉన్నాడు రామ్ చ‌ర‌ణ్. తండ్రి సైరా న‌ర‌సింహారెడ్డిని నిర్మిస్తున్నాడు. ఇప్పుడు రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు చ‌ర‌ణ్. 

More Related Stories