రామ్ చరణ్ నయా రికార్డు..ఫస్ట్ తెలుగు హీరో



 Ram Charan
2020-11-10 11:31:59

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. అతి తక్కువ కాలంలో ట్విట్టర్ లో మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న హీరోగా చెర్రీ రికార్డులు బ్రేక్ చేశారు. కేవలం 233 రోజుల్లో మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించి చరణ్ ఈ ఘనతను దక్కించుకున్నారు. ఈ ఏడాది మార్చ్ లో చరణ్ ట్విట్టర్ లో ఖాతా తెరిచారు. అయితే ఇప్పుడు చరణ్ ను మిలియన్ మంది ఫాలో అవుతున్నప్పటికి ఆయన కేవలం ఇద్దరినే ఫాలో అవుతున్నారు. వారిలో ఒకరు మెగా స్టార్ కాగా మరొకరు పవర్ స్టార్. 

ఇదిలా ఉండగా సినిమాల విషయానికొస్తే చెర్రీ ప్రస్తుతం "ఆర్ఆర్ఆర్" సినిమాలో అల్లూరి పాత్రలో నటిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చరణ్ టీజర్ విడుదలై యూట్యూబ్ లో అతితక్కువ సమయంలో ఎక్కువ వ్యూవ్స్ వచ్చిన టీజర్ గా రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు చరణ్ మరో రికార్డు సొంతం చేసుకోవడం విశేషం. మరోవైపు చరణ్ తన తండ్రి మెగాస్టార్ హీరోగా నటిస్తున్న "ఆచార్య" సినిమాలోనూ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇక ప్రస్తుతం చిరు కి మంచి హిట్ సినిమాలు అందించిన దర్శకుడు రాఘవేంద్రరావు చరణ్ తో ఓ సినిమా తీయబోతున్నారని వార్తలు చక్కర్ల కొడుతున్నాయి. అవి ఎంతవరకు నిజం అని తెలియాలంటే వేచి చూడాల్సిందే.

More Related Stories