జక్కన్నకు భయపడి సందీప్ ని ఆశ్రయించిన చరణ్ 



Sandeep Reddy Vanga
2020-08-04 13:05:00

జక్కన్న సినిమా తర్వాత హీరోల నెక్ట్స్ మూవీస్ ఫట్ అవుతాయని ఓ బ్యాడ్ ముద్ర ఇప్పటికే ఇండస్ట్రీలో ఉంది. అందుకు ఎన్నో ఉదాహరణలు. ఈయనతో సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ కానీ ఈయన సినిమా రిలీజ్ అయ్యాక చేసే సినిమా ఎంత పెద్ద డైరెక్టర్ తో చేసినా అది ఫట్ కావడం ఖాయం. రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, చరణ్ లు కలిసి ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మీద ఒక్క టాలీవుడ్ కే కాక టోటల్ ఇండియా లెవల్ లో హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ జక్కన్న సెంటిమెంట్ ఈ ఇద్దరు హీరోలని భయ పెడుతోంది. అందుకే ఈసారి ఈ సెంటిమెంట్ ని ఎలా అయిన బ్రేక్ చేయాలని ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఓ పొలిటికల్ డ్రామా చేస్తున్నాడు. తను కూడా ఈ దెబ్బ నుండి బయట పడాలని చరణ్ చేయని ప్రయత్నం ledhu. అందుకే ఈసారి ఈయన సందీప్ వంగాతో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. చేసింది ఒక్క సినిమానే, దానినే రీమేక్ చేసి బాలీవుడ్ లోనూ హిట్ కొట్టాడు. ఇప్పుడు ఈయన అయితే కరెక్ట్ అని చరణ్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. చూద్దాం మరి ఏమవుతుందో ?

More Related Stories