ఆచార్య లో చరణ్ భారీ యాక్ష‌న్ ఎపిసోడ్..నెవ‌ర్ బిఫోర్ అంట



Ram Charan
2021-04-14 16:42:39

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఆచార్య సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో చ‌రణ్ తండ్రితో క‌లిసి దాదాపు అర‌గంట పాటు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుండి విడుద‌లైన చ‌ర‌ణ్ పోస్టర్ లు సినిమాపై అంచ‌నాలను రెండింత‌లు చేశాయి. అయితే తాజాగా ఈ సినిమా పై ఆ వార్త ఫిల్మ్ న‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. 

అదేంటంటే ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ తో కొరటాల ఓ భారీ యాక్షన్ సీన్ ను చిత్రీకరించారట ‌. ఆచార్య సినిమాలో ధ‌ర్య‌స్థ‌లి పేరుతో ఓ భారీ సెట్ ను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సెట్ లోనే భారీ యాక్ష‌న్ సీన్ ఉండ‌బోతున్న‌ట్టు స‌మాచారం. అంతే కాకుండా ఈ యాక్ష‌న్ సీన్ కూడా వ‌ర్షంలో ఉండ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. 

అంతే కాకుండా రామ్ చ‌ర‌ణ్ ఇప్ప‌టివ‌ర‌కు చేసిన సినిమాల్లో లేని విధంగా ఈ ఫైట్ ఉండ‌బోతుంద‌ట‌. ఇక రామ్ చ‌ర‌ణ్ కెరీర్ లో ఇప్ప‌టివ‌ర‌కు చేసిన‌ యాక్ష‌న్ సీన్స్ లో మ‌గ‌ధీర సినిమాలో వంద‌మందితో త‌ల‌ప‌డే సీన్ హైలెట్ గా నిలిచింది. మ‌రి ఇప్పుడు కొర‌టాల మ‌గ‌ధీర ఫైట్ ను బీట్ చేసే ఫైట్ సీన్ ను తెర‌కెక్కిస్తారా లేదా చూడాలి. 

More Related Stories