కొరటాల శివ, దేవి, చిరును విడగొట్టిన రామ్ చరణ్ Ram charan
2019-10-21 12:58:22

కొరటాల శివ చిరంజీవి సినిమా మొన్న విజయ దశమికి ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. అదేంటంటే తన మొదటి సినిమా నుండి మిగతా డిపార్ట్మెంట్స్‌లో టెక్నీషియన్స్‌ని మార్చినా ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ ను మాత్రం కొరటాల మార్చలేదు. మిర్చి మొదలు మొన్నటి భరత్ అనే నేను వరకూ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్‌ని మాత్రం కంటిన్యూ చేస్తూ వచ్చాడు. అయితే ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడే మ్యూజిక్ డైరెక్టర్‌గా సైరా మ్యూజిక్ డైరెక్టర్‌ని సజెస్ట్ చేసారని కానీ కొరటాల మాత్రం దేవినే తీసుకున్నాడు అని ప్రచారం జరిగింది. 

అప్పుడు కావాలని దేవి శ్రీ ప్రసాద్‌ని తీసుకున్నా ఇప్పుడు మళ్ళీ దేవిని పక్కన పెట్టారని అంటున్నారు. ఆయన స్థానంలో బాలీవుడ్‌ లో కంపోజర్స్‌ గా ట్రాక్ లో ఉన్న 'అజయ్-అతుల్‌'ని చిరు సినిమాకి తీసుకున్నారు అని టాక్. గతంలో బాలీవుడ్‌లో సూపర్ 30, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, ధఢక్, సింగం, జీరో లాంటి సినిమాలకు మ్యూజిక్ అందించిన ట్రాక్ రికార్డ్ ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ ద్వయానికి ఉంది. తెలుగులో కూడా రవితేజ హీరోగా తెరకెక్కిన 'షాక్' సినిమాకి మ్యూజిక్ అందించారు. ఆ తర్వాత మళ్ళీ చిరంజీవి సినిమాకి పని చేయనున్నారని అంటున్నారు. 

అయితే దేవీని విడవడం కొరటాలకు ఇష్టం లేదనీ కానీ సైరా లానే ఈ సినిమాని కూడా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ అనుకుంటుండడం వలెనే వారిని తీసుకోవాలని అనుకుంటున్నట్టు చెబుతున్నారు. అలా ఇప్పటిదాకా ఇటు చిరంజీవికి, అటు కొరటాలకి కలిసొచ్చినా  ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి దూరం అయ్యాడన్నమాట. అయితే ఈ సినిమా నిర్మాత రామ్ చరణ్ వలెనే ఇలా అయ్యిందని కొందరు నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. సైరా సినిమాని అన్ని బాషలలో రిలీజ్ చేసినా ఆదరించింది తెలుగు వాళ్ళే అని మళ్ళీ ఎందుకు ప్యాన్ ఇండియా సినిమా పేరు చెప్పి దేవిని తప్పించారని మండిపడుతున్నారు నెటిజన్లు. 

More Related Stories