రామ్ చరణ్ చనిపోతాడంట.. ఆచార్య హిట్ గ్యారెంటీ..ram
2020-04-29 02:53:54

రామ్ చరణ్, చిరంజీవి కలిసి నటిస్తున్నారని స్వయంగా దర్శకుడు కొరటాల శివ కన్ఫర్మ్ చేసాడు. ఆచార్యలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు ఆయనే చెప్పాడు. దానికోసం రాజమౌళి కూడా అనుమతి ఇచ్చాడు. నెల రోజుల పాటు కాల్షీట్స్ కూడా ఇచ్చాడు మెగా పవర్ స్టార్. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో రామ్ చరణ్ చనిపోయే పాత్ర చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈయన 13 ఏళ్ల కెరీర్ లో ఇప్పటి వరకు రెండు సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసాడు రామ్ చరణ్. మగధీరలో చనిపోయి పుట్టి చరిత్ర తిరగరాసాడు.. ఆ తర్వాత ఎవడులో కూడా చనిపోయే పాత్ర చేసాడు.. అది కూడా మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు సెట్స్ పై బిజీగా ఉన్న చిరంజీవి, కొరటాల సినిమాలో రామ్ చరణ్ అతిథి పాత్రలో నటించబోతున్నాడు. దీనికోసం ఆయనకు భారీ పారితోషికం కూడా ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కథను కీలక మలుపు తిప్పే పాత్రలో మెగా పవర్ స్టార్ నటించబోతున్నాడు. దీనికోసం 30 రోజుల డేట్స్ కూడా ఇచ్చాడు చరణ్.

దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు కొరటాల శివ. ఇందులో రామ్ చరణ్ పాత్ర 30 నిమిషాల వరకు ఉంటుందని తెలుస్తుంది. అందులో 25 నిమిషాలు చిరంజీవి కాంబినేషన్ సీన్స్ ఉంటాయని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో స్టూడెంట్ లీడర్ పాత్రలో చరణ్ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయనకు రష్మిక మందన్న జోడీగా నటించబోతుంది. ఈ సినిమాలో చరణ్ పాత్ర చనిపోతుందని.. అక్కడ్నుంచే కథ అసలు మలుపు తిరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన చెల్లిగా నిహారిక నటించబోతుందని తెలుస్తుంది. అప్పటి వరకు ఒకలా ఉన్న కథ చరణ్ పాత్ర ముగిసిన తర్వాత మరోలా ఉంటుందని తెలుస్తుంది. కచ్చితంగా ఈ చిత్రం తెలుగులో మరో కొత్త సంచలనానికి నాందీ పలుకుతుందని.. నక్సలిజం బ్యాక్ డ్రాప్ తో కొరటాల అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇందులో ప్రకృతి ప్రేమికుడిగా నటిస్తున్నాడు మెగాస్టార్. వచ్చే ఏడాది ఆచార్య విడుదల కానుంది. ఒకవేళ చరణ్ చనిపోయే పాత్ర చేస్తే మాత్రం సెంటిమెంట్ వర్కవుట్ ఆచార్య కూడా అదిరిపోయే విజయం అందుకోవడం ఖాయం.

 

More Related Stories