మహేష్ బాబు రికార్డును బ్రేక్ చేసిన చరణ్



Ram Charan RRR
2020-11-01 12:30:21

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా "ఆర్ఆర్ఆర్". జక్కన్న ఈ సినిమాను ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోలుగా రాంచరణ్, ఎన్టీఆర్ నటిస్తున్నారు. రాంచరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా..ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురంభీమ్ పాత్రలో నటిస్తున్నాడు. కాగా రాంచరణ్ అల్లూరి టీజర్ ను చిత్ర యూనిట్ చెర్రీ బర్త్ డే సందర్భంగా విడుదల చేసి సర్ప్రైజ్ చేసింది. ఈ వీడియో భీమ్ ఫర్ రామరాజు అంటూ విడుదల చేసింది. చరణ్ వీడియోకు ఎన్టీఆర్ వాయిస్ తో టీజర్ అదిరిపోయింది. ఇక ఎన్టీఆర్ బర్త్ డే కి కొమురంభీమ్ టీజర్ విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కరోనా లాక్ డౌన్ తో కంప్లీట్ చేయలేకపోయారు. దాంతో ఎన్టీఆర్ టీజర్ ను కొమురంభీమ్ జయంతి సందర్భంగా ఇటీవల విడుదల చేసారు. ఇదిలా ఉండగా చరణ్ భీమ్ ఫర్ రామరాజు వీడియోకు యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూవ్స్ వచ్చాయి. టాలీవుడ్ లో అత్యధిక వ్యూవ్స్ వచ్చిన టీజర్ గా చరణ్ టీజర్ రికార్డులు బ్రేక్ చేసింది. ఈ టీజర్ కు మొత్తం 33.32 మిలియన్ వ్యూవ్స్ వచ్చాయి. కాగా ఇదివరకు సరిలేరు నీకెవ్వరు టీజర్ కు అత్యధికంగా 33.26 మిలియన్ వ్యూవ్స్ తో మొదటి స్థానంలో ఉండగా ఇప్పుడు ఆ రికార్డును చరణ్ టీజర్ బీట్ చేసింది.

More Related Stories