రామ్ చరణ్‌ – శంకర్ మూవీకి ఇంట్రస్టింగ్ టైటిల్.



Ram charan - Shankar movie title news
2021-09-09 22:25:16

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ – సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోంది. ఈ సినిమాని అభిరుచి గల దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ భారీ, క్రేజీ మూవీ సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. ఈ క్రేజీ మూవీ ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు రాజమౌళి, బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. హైదరాబాద్ లో ఈ సినిమా ఓపెనింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ స్టిల్ కూడా రిలీజ్ చేశారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి పవర్ ఫుల్ టైటిల్ పెట్టాలి అనుకుంటున్నారట డైరెక్టర్ శంకర్. అదేంటంటే.. విశ్వంభర. దీనికి అర్ధం విశ్వంను భరించి పాలించేవాడు అని అర్ధం. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియా మూవీకి విశ్వంభర అనే టైటిల్ కరెక్ట్ గా సెట్ అవుతుందని భావిస్తున్నారని సమాచారం. రామ్ చరణ్ కి కూడా ఈ టైటిల్ నచ్చిందని… దీంతో పాటు మరో రెండు, మూడు టైటిల్ అనుకుంటున్నారు కానీ దాదాపుగా ఈ టైటిల్ నే ఫిక్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అని వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా రామ్ చరణ్ కి 15వ చిత్రం కాగా, దిల్ రాజుకు 50వ చిత్రం కావడం విశేషం. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా ఈ టైటిల్ నే ఫిక్స్ చేస్తారా..? లేక వేరే టైటిల్ పెడతారా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More Related Stories