రామ్ చరణ్ శంకర్ సినిమా కోసం సూపర్ స్టార్స్..



Ram Charan Shankar
2021-04-22 12:25:22

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ షూటింగ్ ముగింపు దశలో ఉంది. అంతే కాకుండా చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య లో చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా లో ఒక సాంగ్ మినహా చరణ్ పార్ట్ పూర్తయింది. అయితే ఇప్పటికే చరణ్ తదుపరి ప్రాజెక్టుపై కూడా అనౌన్స్ మెంట్  వచ్చిన సంగతి తెలిసిందే.

ప్రముఖ దర్శకుడు శంకర్ తో చరణ్ 15 తెరకెక్కుతుందని ప్రకటించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక ను అనుకుంటున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాపై ఆసక్తికర వార్త ఒకటి ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో 30 నిమిషాలపాటు ఒక స్టార్ నటుడు కనిపించబోతున్నాడట. అయితే ముందు నుండి ఆ పాత్రను సల్మాన్ ఖాన్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. 

కాగా ప్యాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒక్కో ఇండస్ట్రీ నుండి ఒక్కో స్టార్ నటించబోతున్నారట. ఈ పవర్ ఫుల్ రోల్ లో బాలీవుడ్ నుండి సల్మాన్ ఖాన్, కోలీవుడ్ నుండి విజయ్ సేతుపతి, కన్నడ నుండి కిచ్చా సుదీప్ లేదంటే ఉపేంద్ర నటించే అవకాశం ఉందట. ఇక తెలుగులో అయితే ఆ పాత్రలో పవన్ కళ్యాణ్ లేదా మెగాస్టార్ చేయబోతున్నారని టాక్. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉంటుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
 

More Related Stories