చరణ్ శంకర్ సినిమాపై త్వరలో మరో అప్డేట్ ఉండబోతుందాRam charan
2021-07-05 20:39:04

స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వస్తున్న సమయంలో కూడా రామ్ చరణ్ తన తదుపరి చిత్రం గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వకపోవడంతో ఆయన అభిమానులను కొద్దిగా నిరాశపరిచాడు. ఎందుకంటే మిగతా స్టార్ హీరోలందరూ వారు చేయబోయే రెండు మూడు సినిమాలను లైన్ లో పెట్టుకొని వాటికి దర్శకులను కూడా రెడీ గా ఉంచుకోవడం వల్ల చరణ్ సినిమాపై ఎలాంటి న్యూస్ లేకపోవడంతో వాళ్ళు అసంతృప్తిని వ్యక్తం చేశారు.

 అదే సమయంలో  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో రామ్ చరణ్  హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్  ఇండియా సినిమాను నిర్మిస్తున్నట్టు దిల్ రాజు ప్రకటించాడు. ఈ ప్రకటనతో ఇండియా రేంజ్ లో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత దర్శకుడు శంకర్ 'ఇండియన్ 2' సినిమా కు సంబంధించిన వివాదంలో పలు సమస్యలు ఎదుర్కోవడం, అలాగే 'అపరిచితుడు' హిందీ భాషకు సంబంధించి కూడా వివాదాలను ఎదుర్కోవడం. ఇలా ఒకే సమయంలో లో దర్శకుడు సమస్యల్లో ఇరుక్కోవడం వల్ల రామ్ చరణ్ సినిమా మొదలవుతుందా..? అనే ప్రశ్న అభిమానుల్లో తలెత్తింది. 

కానీ ఆ ప్రశ్నకు జవాబు గా దిల్ రాజు తాజాగా సోషల్ మీడియా లో పెట్టిన ఒక ఫోటో సమాధానం ఇస్తుంది. ఇందులో  రామ్ చరణ్, దర్శకుడు శంకర్, దిల్ రాజు కలిసి ఉన్నారు. దాంతో వీరు  సినిమాకు సంబంధించి మరిన్ని చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక వరుస పరాజయాలతో వెనక పడిపోయిన శంకర్ ఈ సినిమాతో ఎలాంటి విజయం సాధిస్తాడో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

More Related Stories