చార్లీ చాప్లిన్‌తో చిరంజీవి 152వ సినిమాకు సంబంధమేంటి..charan
2019-10-18 04:56:05

చార్లీ చాప్లిన్ ఏంటి.. చిరంజీవి 152వ సినిమా ఏంటి.. అయినా ఇప్పుడు ఎందుకు చార్లీ చాప్లిన్ గుర్తుకొచ్చాడు అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జరుగుతుంది మరి.. రామ్ చరణ్, కొరటాల శివ పోస్ట్ చేసిన ఓ పిక్ ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిస్తుంది. చిరంజీవి 152వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడని తెలుసు. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. నవంబర్ నుంచి షూటింగ్ కూడా మొదలు కానుంది. అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు రామ్ చరణ్ తన ఇన్ స్టాలో కొత్త పిక్ ఒకటి షేర్ చేసాడు.

అందులో చార్లీ చాప్లిన్ ఫోటో పక్కన కొరటాల శివతో కలిసి పోజిచ్చాడు చరణ్. ఇది చూసిన ఫ్యాన్స్ ఇప్పుడు షాక్ అవుతున్నారు. అనుకోకుండా ఇలా చేసారా లేదంటే ఈ పిక్ నుంచి ఏదైనా అభిమానులకు సందేశాన్ని ఇస్తున్నారా అనేది అర్థం కావడం లేదు. కొంపదీసి చిరంజీవి సినిమాలో చార్లీ చాప్లిన్ ఎపిసోడ్ ఏదైనా ఉంటుందా లేదంటే రాబోయే సినిమాలో కామెడీ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారా అనేది కూడా అర్థం కావడం లేదు. ఏదేమైనా కూడా ఇప్పుడు వీళ్లు పోస్ట్ చేసిన ఒక్క పిక్ అనేక అనుమానాలకు తావిస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇద్దరు హీరోయిన్లు ఈ చిత్రంలో నటించబోతున్నారు. కేవలం 90 రోజుల్లోనే సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి.

More Related Stories