ఉయ్యాలవాడ వారసులకు రామ్ చరణ్ ఊహించని షాక్.. Ram Charan
2019-09-19 14:13:31

సైరా నరసింహారెడ్డి సినిమా మొదలుపెట్టిన తర్వాత చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు రామ్ చరణ్. ఈ చిత్ర కథ కోసం చాలా చోట్ల తిరిగారు చిత్రయూనిట్. 190 ఏళ్ల నాటి చరిత్ర కావడంతో కచ్చితంగా అచ్చు తప్పు లేకుండా సినిమా తెరకెక్కించాలని దర్శకుడు సురేందర్ రెడ్డితో పాటు చిరంజీవి కూడా ప్రాణం పెట్టారు. అయితే ఈ సినిమా తెరకెక్కించే ముందు తమ అనుమతి కూడా తీసుకోలేదని ఉయ్యాలవాడ వంశస్థులు చెబుతున్నారు. అసలు తమ అనుమతి లేకుండా తమ వంశ వీరుడి సినిమాను ఎలా తెరకెక్కిస్తారు.. తమకు దానికి తగిన డబ్బులు కావాల్సిందే అంటూ డిమాండ్ చేసారు. దీనిపై కోర్ట్ కేస్ కూడా వేయడానికి సిద్ధమయ్యారు వాళ్లు. అయితే దీనిపై ఇప్పుడు రామ్ చరణ్ సంచలన సమాధానం ఇచ్చాడు. ఉయ్యాలవాడ వంశీకులు చేస్తున్న వ్యాఖ్యలు తాను కూడా చూసానని.. అయితే నరసింహా రెడ్డి తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేసాడు కానీ కుటుంబం కోసం కాదు.. అలాంటి ఆయన కథను ఒక కుటుంబానికి పరిమితం చేసి అతడి స్థాయిని తగ్గించలేనని చెప్పాడు చరణ్. ఒకవేళ తాను ఏదైనా చేయాలనుకుంటే ఊరికి చేస్తాను కానీ కుటుంబానికి మాత్రం చేయనంటూ సంచలనం సృష్టించాడు. అంతేకాదు.. సుప్రీం కోర్ట్ లా ప్రకారం ఓ వ్యక్తి జీవితం 100 ఏళ్ళ తర్వాత చరిత్ర అని.. అది ఎప్పుడు ఎవరైనా ఎలాంటి అనుమతి లేకుండా తెరకెక్కించే హక్కులు ఉంటాయని చెప్పాడు చరణ్. అంటే ఉయ్యాలవాడ కుటుంబానికి తాము ఎలాంటి న్యాయం చేయాల్సిన అవసరం లేదని ఇన్ డైరెక్టుగా చెప్పేసాడు చరణ్. 

More Related Stories