నన్ను నమ్ము బ్రో.. జూనియర్ ఎన్టీఆర్‌కు రామ్ చరణ్ భరోసా.. Ram Charan
2020-10-21 18:19:47

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయనేది మాటల్లో చెప్పడం అసాధ్యం. ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్స్‌లో ఒకటిగా ఈ సినిమా వస్తుందిప్పుడు. దానికి తోడు 300 కోట్లకు పైగా బడ్జెట్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరిగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఇందులో అల్లూరి ఎలా ఉంటాడో అందరికీ తెలిసిపోయింది. మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా దీన్ని విడుదల చేసాడు జూనియర్ ఎన్టీఆర్. అందులో చరణ్ కోసం ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం చరణ్ వాయిస్ ఇస్తున్నాడు. అక్టోబర్ 22న భీమ్ టీజర్ విడుదల కాబోతుంది. దీనికి సంబంధించి చరణ్, ఎన్టీఆర్ మధ్య ఆసక్తికరమైన చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది బ్రో.. పైగా నువ్వు పెట్టుకుంది జక్కన్నతో.. అంత ఈజీగా ఒప్పుకోడు.. కాస్త జాగ్రత్త అంటూ రామ్ చరణ్ కు జూనియర్ రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. అది చూసిన రామ్ చరణ్ కూడా అంతే అందంగా రిప్లై ఇచ్చాడు. నువ్వేం కంగారు పడకు బ్రో.. కచ్చితంగా ఆలస్యమైనా కూడా అదిరిపోతుంది అంటూ భరోసా ఇచ్చాడు. అక్టోబర్ 22 ఉదయం 11 గంటలకు భీమ్ టీజర్ విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు. మరి అది ఎలా ఉండబోతుందో చూడాలి. 

More Related Stories