రామ్‌ చరణ్‌కు కరోనా పాజిటివ్Ram Charan
2020-12-29 15:31:53

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కరోనా కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు‌ ‘నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నాను. త్వరగా కోలుకుంటానని ఆశిస్తున్నాను. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారందరూ టెస్ట్‌ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ తెలిజయజేస్తాను’ అంటూ రామ్‌ చరణ్‌ ట్వీట్‌ చేశారు. క్రిస్మస్ పండగ సందర్భంగా మెగా ఫ్యామిలీ అంతా ఒకచోట చేరిన సంగతి తెలిసిందే. దీంతోపాటు ఆదివారం ఆయన ‘ఆచార్య’ సెట్లో సందడి చేశారు. చెర్రీపై సన్నివేశాలు చిత్రీకరించకపోయినా దర్శకుడు కొరటాల శివ, ఇతర బృందం ఆయనతో కాసేపు ముచ్చటించారు. ఇప్పుడు చెర్రీకి కరోనా పాజిటివ్ రావడంతో మెగా ఫ్యామిలీతో పాటు ‘ఆచార్య’ యూనిట్ టెన్షన్ పడుతోంది.

More Related Stories