సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుకకు రామ్ చరణ్..charan
2019-12-08 03:29:41

డిసెంబరు 1 నుంచి సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రమోషన్ పనులు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే మైండ్ బ్లాక్ అంటూ పాటను కూడా విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. డిసెంబరు ఒకటి నుంచి వరసగా ఐదు సోమవారాలు 5 పాటలు విడుదల చేయాలని సరికొత్త ప్లాన్ సిద్ధం చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఒక పాట ఆల్రెడీ అయిపోయింది.. మరో నాలుగు సోమవారాలు నాలుగు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. డిసెంబర్ నెల అంతా పాటల హడావిడితో కొనసాగించి జనవరి 1 న ట్రైలర్ విడుదల చేస్తారని తెలుస్తోంది.

ఇప్పటికే ఒక్క పాట చిత్రీకరణ మినహా మిగతా షూటింగ్ అంతా పూర్తి అయిన నేపధ్యంలో ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో దర్శక నిర్మాతలు బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు రామ్ చరణ్ ను ముఖ్య అతిధిగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ నుంచి ఒక మంత్రి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక మంత్రిని పిలిచి సరిలేరు నీకెవ్వరు సినిమాకు పూర్తిగా రాజకీయ రంగులు అడ్డుకున్నాడు మహేష్ బాబు. ఇరు రాష్ట్రాల నుంచి ఇద్దరు మంత్రులను తన సినిమా ఇంటికి ఆహ్వానించి తాను అందరివాడు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు సూపర్ స్టార్. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. రష్మిక మందన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు రామబ్రహ్మం సుంకర సంయుక్తంగా సరిలేరు నీకెవ్వరు సినిమాను నిర్మిస్తున్నారు.

More Related Stories