మాస్టర్ దర్శకుడిపై కన్నేసిన రామ్ చరణ్.. RRR తర్వాత..Ram Charan
2020-08-07 18:45:43

రామ్ చరణ్ తర్వాత సినిమా ఏంటి.. కొన్ని రోజులుగా సమాధానం లేని ప్రశ్న ఇది. రాజమౌళి సినిమాలో ఆయనతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాకముందే త్రివిక్రమ్ తో తన నెక్ట్స్ ప్రాజెక్టు వర్కవుట్ చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అంతేకాదు ఆ తర్వాత ప్రశాంత్ నీల్ కూడా లైన్ లో ఉన్నాడు. కానీ రామ్ చరణ్ మాత్రం రాజమౌళి తర్వాత ఎవరితో సినిమా చేయాలనే విషయంలో డైలమాలో పడిపోయాడు. ఇప్పటికే ఈయనకు చాలా మంది దర్శకులు కథలు చెప్పారు. అందులో అనిల్ రావిపూడి, గౌతమ్ తిన్ననూరి, సుజిత్ ఇలాంటి క్రేజీ దర్శకులు కూడా ఉన్నారు. అయినా కూడా రామ్ చరణ్ ను మెప్పించే కథ ఎవరూ చెప్పలేదని తెలుస్తోంది. 

ఈ క్రమంలోనే ఆయన చూపు తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ పై పడిందని ప్రచారం జరుగుతోంది. ఖైదీ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ కుర్ర దర్శకుడు. ఈ మధ్యే విజయ్ హీరోగా మాస్టర్ సినిమా తెరకెక్కించాడు లోకేష్. అయితే ఈ సినిమా కరోనా కారణంగా విడుదల కాలేదు. ఇదిలా ఉంటే ఈయన త్వరలోనే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెలుగులో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ద్విభాషా చిత్రంగా ఇది ఉండబోతుందని.. ఖైదీ సీక్వెల్ తర్వాత దీనిపై లోకేష్ ఫోకస్ చేస్తాడని తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అయితే కచ్చితంగా చరణ్ కు తమిళనాట కూడా మంచి మార్కెట్ రావడం ఖాయం. 

More Related Stories