శంకర్ దర్శకత్వంలో చరణ్ ప్యాన్ ఇండియా సినిమా



Ram Charan
2021-02-12 16:22:42

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. సినిమాను జక్కన్న హరి మల్టీ స్టారర్ గాతెరకెక్కిస్తున్నారు. చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా.. చరణ్ అల్లూరి పాత్రలో నటిస్తున్నాడు. ఇక చిరు హీరోగా కొరటాల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న "ఆచార్య " సినిమాలోనూ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సిద్ధ అనే క్యారెక్టర్ లో చరణ్ నటిస్తున్నాడు. అయితే ఈ రెండు సినిమాల తరవాత చరణ్ ఏ సినిమా చేయబోతున్నడన్నదానికోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యలో అదిరిపోయే వార్త ఒకటి బయటకు వచ్చింది. చరణ్ "ఆర్ఆర్ఆర్" సినిమా పూర్తయ్యాక ప్రముఖ దర్శకుడు శంకర్ తో సినిమా చేయబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించబోతున్నారు. ఇక ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది. 

More Related Stories