చిరంజీవి త‌ర‌వాత అత‌నికి మాత్రమే అలాంటి క్యారెక్ట‌ర్ ఉంది : శ‌ర్వానంద్‌



Ram Charan
2021-03-09 15:28:06

మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఖ‌మ్మంలో శ్రీకారం ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో శ‌ర్వానంద్ మాట్లాడుతూ...`బాస్ ముందు మాట్లాడాలంటే ఏదో టెన్షన్‌లా ఉంది. ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదు.. ఏ పాయింట్ మరిచి పోకూడదని రాసుకుని మ‌రీ వచ్చాను.. మొదటి సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్.. నేను మొదట‌ చూసిన విజయం.. శ్రీకారం చుట్టింది కూడా ఆయనే.. మా శ్రీకారానికి ఇలా గెస్ట్‌గా రావడం చాలా ఆనందంగా ఉంది.. శ్రీకారం సక్సెస్ అనేది ఆయన ఈ ఫంక్షన్‌కు రావడానికి ఒప్పుకున్నప్పుడే .. ఒక్క మాట చెప్పాడు.. శర్వా.. నీ సంకల్పం గొప్పదే.. దేవుడు నీ తలరాతను తిరిగి రాస్తాడు.. ఆ మాట గుర్తు చేసుకుంటూనే ఉంటాను.. ఆ సంకల్పమే నా స్టార్‌ను మార్చింది.. నన్ను స్టార్‌ను చేసింది.. అందుకే ఇలా నిలబడ్డాను.. ఇంకో వ్యక్తి గురించి చెప్పాలి.. 

నేను గర్వంగా చెప్పుకునే పేరు.. నా మిత్రుడు రామ్ చరణ్..ట్రైలర్ చూశాకా ఫస్ట్ ఫోన్ కాల్ రామ్ చరణ్ నుంచి వచ్చింది. ఈ సినిమా ఆడాలి.. ఆడుతుంది.. ఏ సాయం కావాలి చెప్పు చేస్తాను అని అన్నాడు. వెంటనే చిరంజీవికి ఫోన్ చేసి శర్వా సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. మనం సాయం చేయాలి అన్నాడు. వారసత్వం ద్వారా ప్రాపర్టీస్ వస్తాయ్ కానీ చిరంజీవి గారి క్యారెక్టర్ వారసత్వం ద్వారా రామ్ చరణ్‌కు వచ్చింది.. ఇంకెవ్వరికీ దక్కదు. అది కేవలం నా ఫ్రెండ్ చరణ్‌కే సొంతం.  థ్యాంక్యూ చరణ్.. నాకు సపోర్ట్ ఇచ్చినందుకు.. నా మంచి కోరుకునే చిరంజీవి, రామ్ చరణ్‌లకు నా సినిమాలు ఎప్పుడూ థ్యాంక్స్ చెబుతూనే  ఉంటాయి. ఈ సినిమాలో కావాల్సినంత ప్రేమ, సరిపోయే కామెడీ,  సెంటిమెంట్స్, ఏడిపించే విలన్. అన్నం పెట్టే భూమి, నవ్వించే నాన్న.. అందమైన అమ్మాయి.. వీటి చుట్టూ తిరిగే అబ్బాయి. అన్నీ ఉంటాయి.. జై జవాన్.. జై కిసాన్.. జై హింద్’ అంటూ ముగించారు.

More Related Stories