ఆర్జీవి ఇంట విషాదం



 Ram gopal varma
2021-05-24 10:56:47

ఆర్జీవి ఇంట క‌రోనా విషాదాన్ని నింపింది. ఆర్జీవికి వ‌ర‌స‌కు సోద‌రుడైన పి.సోమ‌శేఖ‌ర్ క‌రోనాతో మ‌ర‌ణించారు. కొద్దిరోజుల క్రితం క‌రోనా బారిన‌ప‌డ్డ సోమ‌శేఖ‌ర్ హైద‌రాబాద్ లోని ఓ ప్ర‌యివేట్ ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న క్ర‌మంల మ‌ర‌ణించారు. సోమ‌శేక‌ర్ రంగీలా, స‌త్య‌,కంపెనీ వంటి సినిమాలకు నిర్మాణ బాధ్య‌త‌లు వ‌హించారు. అంతే కాకుండా ముస్కురాకే దేక్ జ‌ర చిత్రానికి అనురాగ్ క‌శ్య‌ప్ క‌థ రాయ‌గా సోమ‌శేఖ‌ర్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిచారు. సోమ‌శేఖ‌ర్ మ‌ర‌ణంతో ఆర్జీవి ఎమోష‌న‌ల్ అయ్యారు. "కొన్నేళ్లుగా అతడు మాతో లేడు. ఇతర వ్యాపారాల్లోకి వెళ్లడంతో చాలాకాలంగా మాకు దూరంగా ఉంటున్నాడు. నా జీవితంలో సోమశేఖర్‌ చాలా కీలకమైన వ్యక్తి. అతడిని చాలా మిస్‌ అవుతున్నాను" అని పేర్కొన్నాడు.

ఈ సంద‌ర్భంగా బాలీవుడ్ నిర్మాత బోణీక‌పూర్ కూడా ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. తల్లి కోసం ఎంతో శ్రద్ధ తీసుకున్న శేఖర్‌, కరోనా సోకిన తర్వాత కూడా ఆమె కోసం పరితపించాడు. ఈ క్రమంలో అతడూ కరోనా బారిన పడ్డాడు. అయినప్పటికీ తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ ఆమెను కాపాడుకోగలిగాడు కానీ తను మాత్రం ప్రాణాలు కోల్పోయాడు అంటూ బోణీక‌పూర్ ట్వీట్ చేశారు. జేడీ చక్రవర్తి జేడీ చ‌క్ర‌వ‌ర్తి కూడా సోమ‌శేఖ‌ర్ మ‌ర‌ణంపై స్పందించారు. స‌త్య సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఆర్జీవి కంటే తాము సోమ‌శేఖ‌ర్ కే ఎక్క‌వ భ‌య‌ప‌డేవారిమ‌ని చెప్పారు. కానీ కొంతకాలంగా సోమ‌శేఖ‌ర్ ఒంట‌రి వాడ‌య్యాడ‌ని క‌నీసం ఫోన్ కూడా మాట్లాడ‌టం లేద‌ని పేర్కొన్నారు. ఇంత‌లోనే క‌రోనా తో మ‌ర‌ణించ‌డం విషాద‌క‌ర‌మ‌న్నారు. 

More Related Stories