మర్డర్ పబ్లిసిటీ కోసం ఆర్జీవి భారీ స్కెచ్



Ram Gopal Varma
2020-12-18 14:21:17

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన "మర్డర్" సినిమా విడుదలకు రెడీగా ఉంది. సినిమాను మిర్యాలగూడ మారుతీరావు ఉదంతం ఆధారంగా చిత్రించారని ప్రణయ్ తండ్రి కోర్టును ఆశ్రయించారు. మరోవైపు మారుతీరావు తమ్ముడు కూడా సినిమాను నిలిపివేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. దాంతో కోర్టు కేసుల్లో ఇరుక్కున్న ఈ సినిమా ఎట్టకేలకు అన్ని అడ్డంకులు తొలిగి విడుదలకు సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో ఆర్జీవి ఓ వీడియోను పోస్ట్ చేసారు. వీడియోలో ఆర్జీవి మాట్లాడుతూ.."మర్డర్" సినిమా అన్ని అడ్డంకులను తొలగించుకుని విడుదలకు సిద్దంగా ఉంది. 

ఈ సినిమాను డిసెంబర్ 24న విడుదల చేస్తున్నాం. ఎన్నో నిజజీవిత సంఘటనల ఆధారంగా తీసిన యదార్థ కథ ఇది. సినిమాను ఈనెల 24న విడుదల చేస్తున్నాము. కాబట్టి దానికి ముందు మిర్యాలగూడలో 22న ప్రెస్ మీట్ పెట్టాలని నిర్ణయించుకున్నాము. మిర్యాలగూడలో మీడియా సమావేశం పెడితేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. సినిమా తల్లి తండ్రులు, పిల్లలకు మధ్య జరిగే నిరంతర యుద్ధం లా ఉండతుంది. పిల్లల ఇష్టాలను తల్లితండ్రులు కాదన్నప్పుడు ఎలాంటి నష్టం జరుగుతుందో ఈ సినిమాలో తెలుస్తుంది" అంటూ ఆర్జీవి చెప్పారు. అయితే ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో సినిమా ప్రమోషన్ ను సంపాదించే ఆర్జీవి ఈసారి ఇలా సినిమా ప్రమోషన్ ను ప్లాన్ చేసి ఉంటారని అంతా భావిస్తున్నారు.
 

More Related Stories