సినిమాలకి గుడ్ బై చెప్పనున్న పాత్ బ్రేకింగ్ డైరెక్టర్rgv
2019-12-28 20:28:48

దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ఏమి చేసినా అది వార్తల కోసమే. ఆయన రెండేళ్ళ క్రితం వెబ్‌ సిరీస్‌ కడప అంటూ ఒక ట్రైలర్‌ రిలీజ్ చేశారు. ఇందులో ఏ పాత్రా కల్పితం కాదు.. ప్రాణ భయం మూలంగా వారి పేర్లు. ప్రాంతాల పేర్లు మార్చి చెప్పామంటూ వర్మ వాయిస్‌ ఓవర్‌ తో వచ్చిన ఆ ట్రైలర్‌ అప్పట్లో రచ్చ రేపింది. అయితే కాలక్రమేణా అది మరుగున పడి వర్మ దాని గురించి మర్చిపోయారని అనుకున్నారు అంతా. అయితే అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఆయన మళ్ళీ ఆ సిరీస్ మీద ద్రుష్టి సారించినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం స్క్రిప్టింగ్ వర్క్ జరుగుతుందని, త్వరలోనే ఈ సిరీస్ షూట్ కి వెళ్లనుందని అంటున్నారు.  తాజాగా ముంబై అండర్‌వరల్డ్‌ మాఫియా నేపథ్యంలో ఓ వెబ్‌సిరీస్‌ తీస్తానని ప్రకటించాడు వర్మ. గత రెండు దశాబ్దాల నుంచి నెలకొన్న పరిస్థితులపై చాలా పరిశోధించి కీలక విషయాలు సేకరించానని తాను సిద్దం చేసిన కథను చూపించాలంటే కేవలం వెబ్‌సిరీస్‌ అయితేనే సంపూర్ణ న్యాయం జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన మిగిలిన విషయాలు త్వరలోనే వెల్లడిస్తానని చెప్పాడు వర్మ. కడప అనే వెబ్‌సిరీస్‌పై కూడా పనిచేస్తున్నట్లు పేర్కొన్నాడు. అయితే విడుదల తేదీ ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు.
రక్త చరిత్ర సమయంలో సీమ లోపలి నిజాలు పూర్తిగా తెలియకపోవడం, కొన్ని వార్నింగ్‌లు ఇచ్చి పుచ్చుకోవడం వల్ల అసలు రాయలసీమ శరీరాన్ని పూర్తిగా బట్టలిప్పదీసి చూపించలేకపోయానని అందుకు ప్రాయశ్చిత్తంగా ఈ వెబ్ సిరీస్‌లో భయాన్ని నూతిలోకి పారేసి, ఎవడేమి అనుకున్నా, ఎవ్వడేమి ఫీలయినా లెక్క చేయకుండా నిజమైన కథని నిజంగా చూపించడానికి సైకిల్ చైన్ మీద ఒట్టేసి కంకణం కట్టుకున్నట్లు రాంగోపాల్ వర్మ పేర్కొనడం అప్పట్లో కలకలం రేపింది.దీంతో ఇక సినిమాలకి ఆయన ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు అని కూడా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఆయన ఈ మధ్య సినిమాల విషయంలో సెన్సార్ ఇబ్బందులు ఎద్రుకొంతున్నారు. ఈ వెబ్ సిరీస్ కి అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఆయన భావిస్తున్నాట్టు చెబుతున్నారు.

 

More Related Stories