వర్మకు వాళ్ల దీవెనలు కావాలంట.. కమ్మరాజ్యంలో కడపరెడ్లు ట్రైలర్..rgv
2019-10-21 19:14:56

నెగటివ్ పబ్లిసిటీ చేయడంలో భారతదేశ సినీ చరిత్రలో రామ్ గోపాల్ వర్మని మించిన వారు మరొకరు లేరు. ఆయన తన సినిమాను మొహం మీదే చూడొద్దు అని చెబుతాడు. తన సినిమాను ఆదరించకండి అంటాడు. ఇప్పుడు కూడా మరో జిమ్మిక్కు చేస్తున్నాడు వర్మ. ప్రస్తుతం ఈయన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇందులోని రెండు పాటలు ఇప్పటికే సంచలనం సృష్టించాయి. ఇప్పుడు ఏకంగా ట్రైలర్ విడుదల చేయబోతున్నాడు. బాబు చంపేస్తాడు అంటూ కావాల్సినంత రచ్చ చేసిన ఈయన.. ఇప్పుడు ట్రైలర్ ను దివాళి స్పెషల్ గా విడుదల చేస్తున్నాడు. అక్టోబర్ 27 ఉదయం 9.36 నిమిషాలకు ట్రైలర్ విడుదల చేయబోతున్నాడు వర్మ. ఇదివరకు కూడా బాబు చంపేస్తాడు పాటను వీర బ్రహ్మ ముహూర్తం అంటూ సాయంత్రం 4 గంటల 37 నిమిషాలకు విడుదల చేసాడు వర్మ.

ఇప్పుడు ఈ ట్రైలర్ కు రౌడీలు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, ప్రజల సపోర్ట్ కావాలంటూ ట్వీట్ చేసాడు ఈయన. కచ్చితంగా ఈ సినిమాతో మరోసారి సంచలనాలు, కాంట్రవర్సీలు సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు ఈ దర్శకుడు. ఇదే ఏడాది సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు లుక్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దానికి తోడు కావాలని వివాదాలను కొని తెచ్చుకుంటున్నాడు వర్మ. మరోసారి ఇప్పుడు ఇదే చేస్తున్నాడు. మరి ఈ సారి ఎలాంటి సరికొత్త వివాదానికి రామ్ గోపాల్ వర్మ తెర తీస్తాడనేది చూడాలి.

More Related Stories