రామ్ రెడ్ కి సంక్రాంతికి రెడీనా  Ram pothineni RED
2020-08-25 23:35:32

కరోనా వల్ల ప్రపంచమే స్థంబించింది. ఇక సినిమాలు ఒక లెక్కా, సినిమా థియేటర్లు సహా షూటింగ్ లు అన్నీ వాయిదా పడ్డాయి. ఇప్పుడైతే షూటింగ్స్ కి అనుమతి ఇచ్చారు. అయినా చిన్న చిన్న సినిమా యూనిట్స్ తప్ప ఎవరూ సినిమాలు చేయడానికి సిద్దంగా లేరు. థియేటర్స్ అయితే ఇప్పట్లో ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. థియేటర్స్ లేకుంటే రిలీజ్ లు కూడా ఉండవు కదా. ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. ఆ దెబ్బకి ఈ రెండు-మూడు నెలల్లో రిలీజ్ కావాల్సిన సినిమాలు మొత్తం వాయిదా పడినట్టే. థియేటర్స్ లో కొత్త సినిమాలను చూసే అవకాశం లేనట్టే. ఇక రామ్ రెడ్ సినిమా ని డిజిటల్ ఫ్లాట్ ఫాంలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడని ఆ మధ్య ప్రచారం జరగ్గా దానిని అప్పట్లోనే ఖండించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి మళ్లీ మరో ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ దగ్గరగా 30 కోట్ల వరకు ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు. అయినా సరే మేకర్స్ ఈ చిత్రాన్ని అమ్మేందుకు ఏమాత్రం ఆసక్తి చూపలేదని తెలుస్తుంది. సంక్రాంతికి అన్ని కుదిరితే నేరుగా థియేటర్ లో రిలీజ్ చేయాలనేది రామ్ అండ్ కో ప్లాన్ అని చెబుతున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా నివేదా పేతురేజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా రెడ్ సినిమా తెరకెక్కింది. శ్రవంతి రవి కిశోర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

More Related Stories