రామ్ కళ్ళు తెరిపించిన నాని.. మనసు మార్చుకున్న ఇస్మార్ట్ శంకర్.. Ram Pothineni RED
2020-09-16 19:30:11

ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఈయన సినిమాల మార్కెట్ డబుల్ అయిపోయింది. ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ సినిమా చేస్తున్నాడు రామ్ పోతినేని. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని కూడా చాలా కాలం అయిపోయింది. కరోనా వైరస్ కానీ లేకపోయి ఉంటే ఈ పాటకి సినిమా విడుదలై టీవీలో కూడా వచ్చి ఉండేది. కానీ ఇప్పటికీ థియేటర్లోకి రాలేదు ఈ సినిమా. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరో మూడు నాలుగు నెలల వరకు థియేటర్లు ఓపెన్ చేయడం కష్టంగా కనిపిస్తోంది. ఇదే విషయంపై ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చింది. కరోనా వైరస్ దారుణంగా విజృంభిస్తున్న ఈ సమయంలో థియేటర్లో ఓపెన్ చేయడం మంచి నిర్ణయం కాదని వాళ్లు తెలిపారు. దాంతో సంక్రాంతి సీజన్ కూడా నీరుగారి పోయేలా కనిపిస్తుంది. మరోవైపు రామ్ తన రెడ్ సినిమాను ఖచ్చితంగా థియేటర్లలో విడుదల చేస్తానని భీష్మించుకుకూర్చున్నాడు.

అయితే ఇన్ని రోజులు పరిస్థితులు ఎలా ఉన్నా ఇప్పుడు పరిస్థితులకు తగ్గట్టు తన నిర్ణయం మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. మొన్నటికి మొన్న నాని నటించిన వి సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఒకవేళ ఈ సినిమా థియేటర్లలో విడుదల అయి ఉంటే డిజాస్టర్ అయ్యుండేది. నిర్మాతలు భారీ నష్టాలు మిగిల్చేది. కానీ ఇప్పుడు ఓటీటీ పుణ్యమాని నిర్మాత దిల్ రాజుకు 10 కోట్లకు పైగానే లాభాలు వచ్చాయి. ఇదంతా చూసిన తర్వాత తన సినిమాను కూడా డిజిటల్ లో విడుదల చేయాలని రామ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని జెమినీ టీవీ సొంతం చేసుకుంది. ఒకవేళ డిజిటల్లో విడుదల చేయాలంటే వాళ్ళ అనుమతి తీసుకోవాలి. మొత్తానికి చూడాలి నాని దారిలో రామ్ కూడా వస్తాడో లేదో. 

More Related Stories