ఎన‌ర్జిటిక్ హీరోతో మురుగ‌దాస్ సినిమా



 Ram Pothineni
2021-06-03 17:45:52

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం వ‌రుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అంతే కాకుండా డిఫ‌రెంట్ సినిమాల‌తో రామ్ ఇప్పుడు ప్రేక్ష‌కుల‌ను మెప్పించేందుకు వస్తున్నారు. ఇప్ప‌టికే లింగు స్వామి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ హీరోగా ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా న‌టించ‌బోతుంది. ఈ సినిమాకు శ్రీనివాస్ చిట్టా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అంతే కాకుండా క‌రోనా ప‌రిస్థితులు సాధార‌ణ స్థితికి రాగానే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ల‌బోతున్నారు. 

ఇదిలా ఉండ‌గా రామ్ ఇప్పుడు మ‌రో క్రేజీ ప్రాజ‌క్టుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు రామ్ హీరోగా మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌బోతుంద‌ట‌. ఈ సినిమా గురించి రామ్ మ‌రియు మురుగదాస్ ఇప్టటికే ఫోన్ లో చ‌ర్చించుకున్నారట‌. అంతే కాకుండా మురుగ‌దాస్ స్టోరీ లైన్ వినిపించ‌గా అది రామ్ కు తెగ న‌చ్చేసిందట‌. దాంతో రామ్ కూడా ఈ ప్రాజక్ట్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇక లింగు స్వామితో సినిమా పూర్త‌య్యాక ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా రామ్ పోతినేని ఇటీవ‌ల విడుద‌ల చేసిన మోస్ట్ డిజైర‌బుల్ మెన్ జాబితాలో రెండో స్థానంలో నిలిచి స్టార్ హీరోల‌ను వెన‌క్కి నెట్టేశారు. 

More Related Stories