ఎట్టకేలకి సినిమా ఫైనల్ చేసిన సురేందర్ రెడ్డిRam Pothineni
2020-07-07 20:08:31

‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తెరకెక్కించిన దర్శకుడు సురేందర్ రెడ్డి ఇంకా తన తరువాతి సినిమాని ప్రకటించలేదు. అయితే త్వరలో సురేందర్ రెడ్డి.. యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్‌తో కలిసి ఓ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించబోతున్నారని ఫిలిం నగర్ వర్గాల్లో ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదని క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ తరువాత ఈయన అల్లు అర్జున్ తో కూడా ఒక సినిమా చేయనున్నాడని అన్నారు. దాని మీద అయితే ఇంకా క్లారిటీ లేదు. 

అయితే తాజాగా ఆయన మరో హీరోతో ఆయన సినిమ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఆ హీరో మరెవరో కాదు రామ్. సురేంధర్ రెడ్డి యంగ్ హీరో రామ్ తో ఒక సినిమా కమిట్ అయినట్టు చెబుతున్నారు. రెడ్ మూవీ అనంతరం రామ్ సురేందర్ రెడ్డి సినిమాలో జాయిన్ అవుతాడని అంటున్నారు. ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చిన రామ్ ఇప్పుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత చేసేలా సురేందర్ రెడ్డి రామ్ కోసం ఓ కమర్షియల్ సబ్జెక్ట్ రెడీ చేశారట. త్వరలోనే మూవీపై అధికారిక ప్రకటన రావచ్చని అంటున్నారు.

More Related Stories