ప‌వ‌న్ బండ్ల సినిమాకు టాలెంటెడ్ డైరెక్ట‌ర్Ramesh Varma
2021-05-11 12:02:29

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ రీఎంట్రీ త‌ర‌వాత దూకుడు పెంచారు. వ‌రుస సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన వ‌కీల్ సాబ్ సినిమాను విడుద‌ల చేయ‌గా మంచి విజ‌యం సాధించింది. మూడే ళ్ల త‌ర‌వాత ప‌వ‌న్ ను స్క్రీన్ పైన చూసిన అభిమానులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఇదిలా ఉండగా ఇప్ప‌టికే ప‌వ‌న్ రెండు సినిమాల్లో న‌టిస్తున్నారు. 

అవి అయ్య‌ప్ప‌నుమ్ కోషియం రీమేక్ మ‌రియు హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు ఈ రెండు సినిమాలు కూడా షూటింగ్ ను శర‌వేగంగా జ‌రుపుకుటున్నాయి. ఇవి ఇలా ఉండ‌గానే ప‌వ‌న్ క‌ల్యాణ్ హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. 

అయితే ప‌వ‌న్ మ‌రో సినిమాకు కూడా ఓకే చెప్పార‌ని కొద్దిరోజులుగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. త‌న అభిమాని బండ్ల గ‌ణేష్ నిర్మాణంలో ప‌వ‌న్ ఓ సినిమా చేయ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపించాయి. అంతే కాకుండా ఇటీవ‌ల ఓ అభిమాని ప‌వ‌న్ తో సినిమా ఉంటుందా లేదా చెప్పాల‌ని ట్విట్టర్ బండ్ల గ‌ణేష్ ను ప్ర‌శ్నించ‌గా నా బాస్ తో 100 ప‌ర్సెంట్ సినిమా ఉంటుందంటూ బండ్ల రిప్లై ఇచ్చారు. దాంతో సినిమా ప‌క్కా అని క్లారిటీ వ‌చ్చేసింది. 

అయితే తాజాగా ఈ సినిమా ను ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ తెర‌కెక్కించ‌బోతున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ర‌మేష్ వ‌ర్మ ప‌వ‌న్ కు క‌థ‌ను వినిపించారట‌. క‌థ న‌చ్చ‌డంతో ప‌వ‌న్ ఓకే చెప్పార‌ట‌. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్త‌తం ర‌మేష్ వ‌ర్మ ర‌వితేజ తో ఖిలాడీ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. క‌రోనా కార‌ణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా ప‌డింది. 

More Related Stories