కమ్మరాజ్యంలో కడపరెడ్లు టైటిల్ చేంజ్...వర్మ కొత్త టైటిల్kamma
2019-11-28 04:56:20

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా రిలీజ్ అవుతుందా లేదంటే హైకోర్టు రిలీజ్ ను అడ్డుకుంటుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారడంతో వర్మ దిగొచ్చాడు. ఈ సినిమాలో తనను అవమాన పరిచే విధంగా పాత్ర చిత్రీకరణ ఉందని కెఏ పాల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.  దీనిపై ఈరోజు విచారణ జరిగింది.  వ్యక్తిగతంగా అవమానపరిచేలా పాత్ర చిత్రీకరణ ఉందని, అదే విధంగా ట్రైలర్ లో చూపించారని పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి రివ్యూను ఇవ్వాలని నిర్మాతలను కోర్టు ఆదేశించింది. ఇంకా సినిమాకు సెన్సార్ కాలేదని, సెన్సార్ పూర్తికాగానే రివ్యూను అందిస్తామని కోర్టుకు నిర్మాతలు తెలియజేశారు.  దీంతో కోర్టు దీనికి సంబంధించిన విచారణను రేపటికి వాయిదా వేసింది. ఎందుకొచ్చిన రచ్చ అనుకున్నాడోఏమో కానీ ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’ అనే టైటిల్‌ను ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’గా మార్చారు. రేపు సెన్సార్‌కు వెళ్తున్న ఈ సినిమాను   ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ అనే టైటిల్‌లే వివాదం కావడంతో ఈ టైటిల్ మార్పుతో రేపు సెన్సార్ బోర్డ్‌కు వెళ్తున్నారు వర్మ.

More Related Stories