షూటింగ్ ఎప్పుడు చేస్తున్నావ్ వర్మ.. కరోనాపై తొలి సినిమా..rgv
2020-05-27 14:36:56

అగ్గిపుల్ల.. సబ్బుబిల్ల.. కుక్కపిల్ల కాదేదీ కాదు కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఇప్పుడు వర్మను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను కూడా ఇప్పుడు తను వాడేసుకుంటున్నాడు. దీని విజృంభన చూసి ఇప్పటికే దీనిపై ఓ పాట విడుదల చేసిన వర్మ ఇప్పుడు ఏకంగా సినిమాను తీసుకొస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా అంతా ఇంట్లోనే లాక్ అయిపోతే ఈయన మాత్రం తన పని తాను చేసుకుంటున్నాడు. అసలు ఎక్కడ్నుంచి షూటింగ్ చేస్తున్నాడు.. ఎలా చేస్తున్నాడు అనేది కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. అప్పుడే సినిమాను సిద్ధం చేసాడు. ట్రైలర్ కూడా విడుదల చేసాడు. కరోనా వైరస్ అంటూ ఈ సినిమాకు పేరు కూడా పెట్టాడు. ఇందులో వర్మ ఆస్థాన నటులే ఎక్కువగా కనిపిస్తున్నారు.

అసలు వర్మకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయబ్బా అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వైరస్ విస్తరణతో ప్రపంచం ఎంతగా ఇబ్బందులు పడుతుందో.. ఎలా స్తంభించిపోయిందో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఓ రకంగా కరోనాపై అందరూ ఇంట్లోనే కూర్చుని పోరాటం చేస్తున్నారు కూడా. మొత్తానికి వర్మ చేసిన కరోనా వైరస్ సినిమా అసలు విడుదలవుతుందా లేదా అనేది పక్కనబెడితే అసలు లాక్ డౌన్ లో ఈయన సినిమాలు ఎలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు ఎవరికీ. లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ అగస్త్య మంజు దీనికి దర్శకుడు. అన్నట్లు ఇప్పటికే లాక్‌డౌన్ సమయంలోనే మియా మాల్కోవాతో క్లైమాక్స్ అనే సినిమా చేసాడు వర్మ.

 

More Related Stories