తెలుగులో విడుదలైన రమ్యకృష్ణ క్వీన్.. ఫ్యాన్స్ ఫిదా..ramya
2019-12-29 14:34:12

ఈ రోజుల్లో బ‌యోపిక్స్ కు ఉన్న డిమాండ్ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. లెజెండ్స్ లైఫ్ తో పాటు అంద‌రి జీవితాలు ఇప్పుడు తెర‌కెక్కుతున్నాయి. తెలుగులో కూడా ఇప్పుడిప్పుడే బ‌యోపిక్ ల‌కు క్రేజ్ పెరుగుతుంది. సావిత్రి జీవితం ఆధారంగా వ‌చ్చిన మ‌హాన‌టి బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఎన్టీఆర్ బ‌యోపిక్ డిజాస్టర్ అయినా కూడా ఇప్పటికీ వరస బయోపిక్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు జయలలిత బయోపిక్ కూడా వస్తుంది. ఈ సినిమాను విష్ణు ఇందూరి నిర్మిస్తున్నాడు. త‌మిళనాడుకు అమ్మ‌.. దివంగ‌త‌ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్ ను ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈమె జీవితాన్ని ఇఫ్పుడు వెబ్ సిరీస్ రూపంలో కూడా తీసుకొచ్చాడు గౌతమ్ మీనన్. ఇప్పటికే సినిమాలుగా వస్తున్న అమ్మ సినిమాలో ఒక బయోపిక్ లో కంగనా.. మరో బయోపిక్ లో నిత్యామీనన్ నటిస్తున్నారు.

వీళ్లందరి కంటే ముందు వెబ్ సిరీస్ లో అమ్మగా రమ్యకృష్ణ నటించింది. క్వీన్ టైటిల్ తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 14న  ఎంఎక్స్ ప్లేయర్ లో విడుదలైంది. అయితే ఇప్పటివరకు తెలుగు వెర్షన్ మాత్రం రాలేదు. డిసెంబర్ 28న తెలుగు వర్షన్ కూడా విడుదల చేశారు. దీనికి అద్భుతమైన స్పందన వస్తుంది. దాంతో రమ్యకృష్ణ, గౌతమ్ మీనన్  సంతోష పడుతున్నారు. ఈ వెబ్ సిరీస్ లో  లో జయ లలిత చిన్నప్పటి విషయాలు నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత  ఎంజీఆర్ తో పరిచయం అక్కడినుంచి రాజకీయ అరంగేట్రం ముఖ్యమంత్రి కావడం వరకు అన్ని చూపించాడు గౌతమ్ మీనన్. ఇందులో జయలలితగా రమ్యకృష్ణ ప్రాణం పోసింది. తెలుగులో కూడా ఈ వెబ్ సిరీస్ సంచలనం సృష్టిస్తుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. a

More Related Stories