రమ్యకృష్ణ పారితోషికం తెలిస్తే హార్ట్ ఎటాక్ వస్తుందేమో..

పేరుకు కారెక్టర్ ఆర్టిస్ట్ కానీ రమ్యకృష్ణ తీసుకుంటున్న పారితోషికం ఇప్పుడు స్టార్ హీరోయిన్లు కూడా తీసుకోవడం లేదు. రమ్య ఇమేజ్ ముందు కుర్ర హీరోయిన్లు కూడా నిలబడలేకపోతున్నారు. ఒక్కో సినిమాకు ఆమె పారితోషికం పెరుగుతూ పోతుంది కానీ తగ్గడం లేదు. అరే.. వయసు 50కి చేరువగా ఉన్నా కూడా లెక్క మాత్రం కోటికి పైగా వెళ్తుంది. బాహుబలితో రమ్యకృష్ణ కెరీర్ మారిపోయింది. శివగామి పాత్ర ఆమె జీవితాన్ని మార్చేసింది. దానికి ముందు సోగ్గాడే చిన్నినాయనాలో కూడా రప్ఫాడించేసింది. ఇప్పుడు రమ్యకృష్ణను తట్టుకోవడం నిర్మాతల వల్ల కావడం లేదు. ఒక్కో సినిమాకు కోటికి పైగా తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా శైలజారెడ్డి అల్లుడులో అప్పట్లో 30 రోజుల షెడ్యూల్ కు ఏకంగా కోటి పారితోషికం తీసుకుందని వార్తలు వచ్చాయి. సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.
ఇదే సినిమాలో హీరోయిన్ గా నటించిన అను ఎమ్మాన్యువల్ పారితోషికం రమ్యకృష్ణలో సగం కూడా లేదు. దాంతోనే అర్థమైపోతుంది ఈ భామ క్రేజ్ ఏంటని..? ఇక ఇప్పుడు కూడా దేవా కట్ట సాయి ధరమ్ తేజ్ సినిమాలో నటించడానికి దాదాపు కోటి రూపాయల పారితోషికం అందుకుందని ప్రచారం జరుగుతుంది. ఈమెకు ఇంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా సిద్ధంగానే ఉన్నారంంటే నీలాంబరి క్రేజ్ ఏంటో అర్థమైపోతుంది. ఇక నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న అందధూన్ రీమేక్ లో నటించడానికి రమ్యకృష్ణ ఏకంగా కోటి 25 లక్షల పారితోషికం డిమాండ్ చేసిందని ప్రచారం జరుగుతోంది. హిందీలో టబు పోషించిన పాత్రను ఇక్కడ రమ్యకృష్ణ చేయబోతుంది. కాస్త బోల్డ్ నెస్ ఎక్కువగా ఉండే పాత్ర ఇది. అక్రమ సంబంధం పెట్టుకునే పాత కావడంతో తన ఇమేజ్ ను పక్కన పెట్టి చేయాలంటే కచ్చితంగా అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే అంటుంది రమ్యకృష్ణ. మొత్తానికి హీరోయిన్ గా ఉన్నపుడు రప్ఫాడించిన రమ్య.. ఇప్పుడు అత్త.. అమ్మ అయిన తర్వాత చుక్కలు చూపిస్తుంది. మరి ఈ శివగామి దూకుడుకు బ్రేకులు వేసేది ఎవరో..?