ప్రభాస్ సినిమాలో అతిధి పాత్రలో రానా... Rana Daggubati
2020-06-30 17:03:44

ప్రపంచ దేశాల మీద కరోనా దెబ్బ మామూలుగా లేదు. ఎన్నో దేశాలు షట్ డౌన్ అయ్యాయి. దేశాలు ఇప్పట్లో అయితే కోలుకునే పరిస్థితి అయితే లేదు. ఇక దేశాలే ఇలా ఉంటే ఇక సినిమాల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది. అందరూ ముందు కొంత లైట్ తీసుకుని షూటింగ్ లు చేసినా పరిస్థితి తీవ్రత అర్ధం అయ్యాక అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఏకంగా ఎక్కడో జార్జియాలో షూట్ చేసుకు వస్తామని వెళ్ళిన ప్రభాస్ రాధే శ్యాం యూనిట్ కూడా అన్ని ఆపేసి మధ్యలోనే భయపడి వచ్చేశారు. అయితే ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపులతో మళ్ళీ షూట్ లు చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ యూనిట్ మాక్ షూట్ నిర్వహించే పనిలో ఉండగా, ఇప్పుడు ప్రభాస్ సినిమా షూటింగ్ అప్డేట్ కూడా బయటకి వచ్చింది. పీరియాడిక్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌ గ నటిస్తోన్న సంగతి తెల్సిందే. 

క‌రోనా ఎఫెక్ట్‌కు ముందు ఈ చిత్రానికి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల‌ను జార్జియాలో చిత్రీక‌రించగా ఇప్పట్లో మళ్ళీ ఆ దేశం వెళ్ళే అవకాశం లేదు. అందుకే ఆ దేశంలో షూట్ చేసిన ప్రాంతపు సెట్ హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో వేస్తున్నార‌ట‌. ఆ సెట్ ఖరీదు భారీగా ఉండనున్నట్టు చెబుతున్నారు, ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి ప్రచారం జరుగుతోంది. అదేంటంటే ఈ సినిమాలో రానా ప్రత్యేక అతిధి పాత్రలో రెండు నిముషాల పాటు కనిపించబోతున్నాడని అంటున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాకి రాధే శ్యామ్, జాన్ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని అంటున్నారు. ఈ సినిమాని కూడా ప్యాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానుందని అంటున్నారు.

More Related Stories