యూట్యూబ్ ఛానల్ పెట్టిన రానాRana Daggubati
2020-11-09 21:36:41

వరుస సినిమాలతో బిజీగా ఉన్న రానా తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేసాడు. "సౌత్ బే" అనే పేరుతో ఈ యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేసాడు. ఈ ఛానల్ లో 10 సెకన్ల నుండి 10 గంటల వరకు పలు భాషలకు సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తారట. కథలు మాత్రమే కాకుండా ఫిక్షన్, యానిమేషన్ మరియు మ్యూజిక్ అలాగే న్యూస్ వీడియోలను అప్లోడ్ చేయనున్నారు. అంతే కాకుండా టాలెంట్ ఉన్నవాళ్ళకి ఈ ఛానల్ లో అవకాశాలు కూడా కల్పిస్తామని రానా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్న రానా వైవాహిక జీవితంలో బిజీగా ఉన్నారు. లాక్ డౌన్ వేళ రానా తన ప్రియురాలు మిహికాను కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కరోనా ఆంక్షల కారణంగా అతికొద్ది మంది అతిథుల సమక్షంలోనే పెళ్లి జరిగింది. కరోనా కారణంగా పెళ్ళైన చాలా కాలానికి ఇటీవలే రానా-మిహికలు హనీమూన్ కు వెళ్లారు. కాగా వారి హనీమూన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక సినిమాల విషయానికొస్తే రానా పలు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నాడు. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రానా ఆ తరవాత హౌస్ ఫుల్ 4 సినిమాలో నటించారు. ఈ సినిమకూడా బాలీవుడ్ లో మంచి విజయం సాధించింది. ఇక ప్రస్తుతం రానా "అరణ్య, హిరణ్యకశ్యప" లాంటి సినిమాల్లో నటిస్తున్నారు.

More Related Stories