రోకా ఫంక్షన్ ను ఎంగేజ్మెంటనుకున్నారు...ఇంతకీ రోకా అంటే Rana
2020-05-22 13:53:16

నిన్న ఉదయం రానా దగ్గుబాటి ట్విట్టర్‌లో రెండు ఫొటోలను షేర్ చేశారు. తన ప్రేయసి, కాబోయే భార్య మిహీకా బజాజ్‌తో కలిసి తీసుకున్న ఫొటోలను షేర్ చేసిన ‘అండ్ ఇట్స్ అఫీషియల్’ అని క్యాప్షన్ పెట్టారు. . ఇద్దరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న నేపధ్యంలో ఇవి రానా, మిహీకా నిశ్చితార్థం ఫొటోలు అని అంతా అనుకుని వారికి ఎంగేజ్మెంట్ విషెస్ చెప్పడం మొదలు పెట్టారు. దీనికి మరో కారణం కూడా లేకపోలేదు. మొన్న ఉదయమే ఈరోజు సాయంత్రం 4 గంటలకు రానా, మిహీకాల నిశ్చితార్థం రామానాయుడు స్టూడియోలో జరగనుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని సురేష్ బాబు ఖండించినా ఈ ఫొటోలు నిశ్చితార్థం ఫొటోలనే చాలా మంది అనుకున్నారు. దీనికి తోడు టాలీవుడ్ లీడింగ్ పీఆర్వోలలో ఒకరయిన బీఏ రాజు ఎంగేజేమేంట్ ఫొటోస్ అంటూ పేర్కొనడంతో కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ చానెళ్ళు కూడా రానా నిశ్చితార్థం అయిపోయిందని వార్తలు ప్రచురించాయి. 

అయితే ఇది నిశ్చితార్థం కాదని, దాని కన్నా ముందే జరిగే రోకా వేడుకని హింట్ ఇచ్చాడు రానా. నిజానికి ట్విట్టర్ లో ఈ పిక్స్ చూసిన వెంటనే నాని " అబ్బాయ్, నిశ్చితార్థం జరిగిందా? అని నాని ప్రశ్నించగా, రోకా ఫంక్షన్ జరిగింది అంటూ రానా బదులిచ్చాడు. అయితే రోకా ఫంక్షన్ అంటే ఏమిటో తనకు తెలియక గూగుల్ లో వెతుకుతానని నాని సరదాగా రిప్లయ్ ఇచ్చాడు. అనంతరం ఈ చాట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను రానా పంచుకున్నాడు. అయితే పెళ్లి పనులు అధికారికంగా ప్రారంభమయ్యే ముందు వధూవరులు ఇళ్లల్లో జరిగే కార్యక్రమమే రోకా ఫంక్షన్ అంటారు. ఉత్తరాదిలో ఇది ఎంతో ముఖ్యమైన వేడుక. మనకి కొత్త కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యామన్న మాట. మిహీకా ఫ్యామిలీ సెటిలయింది హైదరాబాద్ అయినా ఉత్తరాదికి చెందిన వారు కావడంతో ఆ వేడుక నిర్వహించారని చెబుతున్నారు. 

More Related Stories