విరాటపర్వం ఫస్ట్ గ్లింప్స్..అదరగొట్టిన రానాViraata Parvam
2020-12-14 19:18:56

రానా బర్త్‌డే సందర్భంగా విరాటపర్వం ఫస్ట్ లుక్  తో పాటు ఫస్ట్ గ్లింప్స్ వీడియో ను రిలీజ్ చేశారు. 1990లో జ‌రిగిన య‌దార్ధ సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. దేశం ముందు ప్రశ్నగా నిలబడిన జీవితం అతనిది. సత్యాన్వేషణలో నెత్తురోడిన జీవితం అతనిది. Dr. రవిశంకర్ అలియాస్ కామ్రేడ్ రవన్న.. అంటూ ఫస్ట్ టీజర్ లో అతని పాత్రను హైలెట్ చేసి చూపించారు. ఈ చిన్న టీజర్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలను పెంచేసింది.  దట్టమైన అటవీ నేపథ్యం, సీరియస్ సన్నివేశాలు, వైవిధ్యమైన నేఫథ్య సంగీతం ఇవన్నీ కలిసి ఒక్క డైలాగు కూడా లేకుండా వున్న టీజర్ ను చూడాలనిపించేలా చేసాయి. 

విరాటపర్వం’ చిత్రాన్ని ఎస్‌.ఎల్‌.వి సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వేణు ఊడుగుల దర్శకుడు.‘సామాజిక ఇతివృత్తానికి వాణిజ్య హంగుల్ని మేళవిస్తూ రూపొందిస్తున్నారు . ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీరావ్‌, సాయిచంద్‌, బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. 

More Related Stories