రానా చేతిలో హీరోయిన్లు..2017-04-01 14:13:46

అవును.. మీరు చ‌దివింది నిజ‌మే. రానా చేతిలోనే ఇప్పుడు హీరోయిన్లు మొత్తం ఉన్నారు. ఆయ‌న ఏం చెబితే అది వింటారు. అదేంటి.. ద‌గ్గుపాటి వార‌సుడి చేతిలో ఏదైనా మంత్ర‌దండం ఉందా ఏంటి అనుకోకండి..! అంత‌కంటే ప‌వ‌ర్ ఫుల్ మేనేజ్ మెంట్ ఉంది. బాంబేలో సాధార‌ణంగా స్టార్ హీరోయిన్లంద‌రినీ ఒకే తాటిపై న‌డిపించే ఓ మేనేజ్ మెంట్ సంస్థ ఉంటుంది. అందులో ఎవ‌రి డేట్లు ఎప్పుడు ఎలా ఉన్నాయి.. ఎవ‌రితో న‌టిస్తున్నారు.. ఏ హీరోతో ఎప్పుడు న‌టించ‌డానికి డేట్స్ ఖాళీగా ఉంటాయి.. ఇలా ఇవ‌న్నీ ప‌క్కాగా ఉంటాయి. కానీ టాలీవుడ్ కి వ‌చ్చేస‌రికి ఇవ‌న్నీ మేనేజ‌ర్స్ చూసుకుంటారు. డేట్స్ విష‌యంలో హీరోయిన్ల‌కు ఇక్క‌డ చాలా ఇబ్బందైపోతుంది. స్టార్ హీరోలైతే ఒక్కో హీరోయిన్ తో మ‌ళ్లీ మ‌ళ్లీ న‌టిస్తున్నారు. దాంతో ఇప్పుడు రానా కొత్త ట్రెండ్ కు తెర‌తీసాడు. బాలీవుడ్ మాదిరే ఇక్క‌డ కూడా మేనేజింగ్ సంస్థ‌ను ఏర్పాటు చేస్తున్నాడు. ఇందులో అగ్ర తారలంతా ఉంటారు. హీరోలు కూడా ఈ మేనేజ్ మెంట్ తో టచ్ లో ఉంటారు. సింపుల్ గా చెప్పాలంటే బాంబే నుంచి వ‌చ్చే హీరోయిన్ల‌కి రానా ఓ గైడ్ లా ఉంటాడు.. కెరీర్ ను గైడ్ చేస్తుంటాడు. మొత్తానికి ఇప్పుడు ఏ హీరోతో ఏ ముద్దుగుమ్మ న‌టించాల‌న్నా రానా త‌లుచుకుంటే చిటిక‌లో అయిపోతుంది. మొత్తానికి బిజినెస్ లో రానా బుర్రే బుర్ర‌.

More Related Stories