అమ్మాయిలు చ‌చ్చిపోతారేమో రానా..!!rana-01
2018-07-03 20:41:31

సాధార‌ణంగా మ్యాగజైన్ క‌వ‌ర్ పేజీల‌పై హీరోయిన్లు అందాల‌తో చంపేస్తుంటారు. అవి చూసి కుర్రాళ్ల ఊపిరి ఆగిపోతుంటుంది. కానీ ఇక్క‌డ మాత్రం కాస్త కొత్త‌గా రానా చంపేసాడు. ఈ ఫోటోలు చూసి.. ఆయ‌న ఇచ్చిన పోజులు చూసి.. అత‌డి ఫిజిక్ చూసి అమ్మాయిల‌కు నిద్ర ప‌ట్ట‌కుండా ఉంటుందేమో మ‌రి. ఇదివ‌ర‌కే మ్యాగ్జిమ్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై త‌న లుక్స్ తో పిచ్చెక్కించాడు రానా.

ఇక ఇప్పుడు మ‌రో మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై క‌నిపించాడు ఈ మ్యాచో. మెన్ మ్యాగ‌జైన్ కోసం అలా వైట్ డ్ర‌స్ లో హ‌ల్క్ లా ద‌ర్శ‌న‌మిచ్చాడు ద‌గ్గుపాటి వార‌సుడు. ఇది చూసిన త‌ర్వాత బాపురే.. అబ్బాయి పిచ్చెక్కించాడుగా అనుకోకుండా ఉండ‌లేరు. ప్ర‌స్తుతం మోడ‌లింగ్ తో పాటు సినిమాలు కూడా వ‌ర‌స‌గా చేస్తున్నాడు రానా. హాథీ మేరీ సాథీ.. 1945.. మార్తండ వర్మ లాంటి సినిమాల‌తో బిజీగా ఉన్నాడు ఈ హీరో.

More Related Stories