రణరంగం ఫస్ట్ డే కలెక్షన్స్ Ranarangam
2019-08-16 15:27:06

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న రణరంగం అలాగే ఎవరు చిత్రాలు థియేటర్లలో విడుదల అయ్యాయి. రణరంగం విషయానికి వస్తే శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆయనకు జంటగా కాజల్ అగర్వాల్ మరియు కళ్యాణి ప్రియదర్శి హీరోయిన్లుగా నటించారు. శర్వా గ్యాంగ్ స్టర్ గా తొలిసారిగా నటించిన ఈ సినిమా బానే ఉన్నా అది రొటీన్ సబ్జెక్ట్ అని తీసి పారేస్తున్నారు. టాక్ ఎలా ఉన్నప్పటికీ రణరంగం థియేటర్లలో కలెక్షన్లను బాగానే రాబట్టుకొనేలా ఉందని తెలుస్తుంది. నిన్న హాలిడే కావడంతో ఆడియన్స్ థియేటర్స్ కి బాగానే వెళ్లారు. ఇక ఈరోజు వర్కింగ్ డే కావడం ఆ తర్వాత వీకెండ్ ఉండడంతో రేపు ఎల్లుండి సినిమాకి మంచి కలెక్షన్స్ రాబట్టచ్చు అని భావిస్తున్నారు. 

ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే  ఈ సినిమా టాక్ అంతగా లేకున్నా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 3.80 కోట్ల షేర్ సాధించింది. ఈ షేర్ శర్వా కెరీర్ లో హిట్ అనిపించుకున్న శతమానంభవతిని కూడా దాటేయడంతో ఈ సినిమా కలెక్షన్స్ అధిగమించినందున శర్వానంద్ కెరీర్ లోనే ఇది హయ్యెస్ట్ కలెక్షన్స్ అని చెబుతున్నారు. తెలుగు స్టేట్స్‌లో ఈ సినిమా 12.50 కోట్ల ప్రీ రిలీజ్ చేసుకున్న ఈ సినిమా ఈ వీకండ్ లోనే బ్రేక్ ఈవెన్ సాధించవచ్చని అంటున్నారు. ఇక ఏరియా వారీగా కలెక్షన్స్ చూస్తే నిజాం 1.40 కోట్లు, సీడెడ్ 0.47 కోట్లు, , యుఎ 0.51 కోట్లు,  గుంటూరు 0.37 కోట్లు,  తూర్పు 0.36 కోట్లు,  కృష్ణ 0.23 కోట్లు,  వెస్ట్ 0.28 కోట్లు,  నెల్లూరు 0.18 కోట్లు,  ఎపి / టిఎస్ కలిసి 3.80 కోట్లు షేర్ సాదించింది. 

More Related Stories