విడుదలకు రంగులద్దుకుంటున్న రంగ్ దే



Rang De
2021-02-24 12:40:33

నితిన్, కీర్తి సురేష్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా "రంగ్ దే". ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. గత నాలుగు రోజులుగా చిత్రంలోని ఓ సాంగ్ కు సంభందించిన దృశ్యాలు చిత్రీకరించడంతో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను పూర్తి చేసుకుంటుంది. సినిమాను 2021 మార్చి 26న ధియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా 'ప్రేమ' తో కూడిన కుటుంబ కధా చిత్రమని తెలుస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ కు, ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా నితిన్ నటించిన మరో సినిమా చెక్ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. పెళ్లి తరవాత నితిన్ నటించిన సినిమాలు కావడంతో ఈ రెండు సినిమాలపై నితిన్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి ఆశలు నెరవేరుతాయా లేదా చూడాలి.  

More Related Stories