బాలీవుడ్ చరిత్రలో ఎంటర్‌టైనర్‌గా గుర్తుండి పోవాలి.. సూపర్‌ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్ Ranveer Singh
2020-12-10 14:13:31

రణ్‌వీర్‌ సింగ్‌ నిజంగా ఓ అద్భుతం నటుడు, హిందీ చిత్రపరిశ్రమలో అతి పిన్నవయస్కుడైన సూపర్‌స్టార్‌ అతను. బ్లాక్‌బస్టర్‌ పద్మావత్‌ చిత్రంలో 300 కోట్ల నమోదు చేసిన మొదటి యువ నటుడు. ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే అతను, సొంతంగానే రోల్‌ మోడల్‌గా ఎదిగాడు.   బయటి వ్యక్తిగా పేరుపడ్డా భారతీయ చిత్రసీమలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ డిసెంబర్‌ 10తో సినిమా రంగంలో రణ్‌వీర్‌ దశాబ్దం పూర్తి చేసుకుంటున్నాడు. అద్భుత విజయాన్ని నమోదు చేసుకున్న అతని మొదటి సినిమా బ్యాండ్‌ బాజా బరాత్‌ చిత్రం పదేళ్ల క్రితం డిసెంబర్‌ 10న విడుదలైంది.  పదేళ్ల వెనక్కి తిరిగి చూస్తే, అతని నైపుణ్యం, వైవిధ్యం  ప్రస్తుత  భారతీయ చిత్రరంగంలో అతని పాత్ర మరువలేనిదని ఏకగ్రీవంగా అంగీకరిస్తారు.

రణ్‌వీర్‌ ఒక అనుపమానమైన నటుడు, వైవిధ్యభరితమైన రంగాలు, పాత్రల ద్వారా తన నటనను ఆయన ప్రదర్శించారు. బ్యాండ్‌ బాజా బారాత్‌లో ప్రేమికుడైన బిట్టూ శర్మ కావచ్చు, లూటేరాలో బంగారు మనస్సు ఉన్న దొంగ పాత్ర కావచ్చు, గోలియోంకీ రాస్‌లీలా, రామ్‌లీలాలో దూకుడుతో కూడిన ప్రేమికుడు కావచ్చు. వెండితెర వెలుగు బాజీరావు మస్తానీలో రాజపుత్రయోధుడు పేష్వా బాజీరావ్‌ కావచ్చు, దిల్‌ దడక్‌నే దో లో కూల్‌, కాంప్లికేటెడ్‌ కబీర్‌ మెహతా కావచ్చు. పద్మావత్‌లో క్రూరుడైన అల్లావుద్దీన్‌ ఖిల్జీ కావచ్చు,  సింబాలో అవినీతిని అంతమొందించేందుకు కంకణం కట్టుకున్న అవినీతిపరుడైన పోలీసు పాత్ర కావచ్చు, గల్లీబాయ్‌లో మైమరపింపజేసే వీధి గాయకుడైన మురాద్‌ పాత్ర కావచ్చు, ప్రతీ పాత్రలో అసమానమైన నటను ప్రదర్శించి తాను మిగతా వారికి భిన్నమని నిరూపించుకున్నాడు రణ్‌వీర్‌. స్టార్‌డమ్‌లో 10వ సంవత్సరంలో అడుగుపెట్టిన రణ్‌వీర్‌, తన చెరిగిపోని మైలురాళ్లు, తన కలలు, ఆకాంక్షలు, సినిమాల్లోకి రాకముందు ఎదుర్కొన్న తిరస్కరణలు, తాను నెలకొల్పదలిచిన వారసత్వం గురించి తమ మనస్సులోని మాటలను వెలిబుచ్చారు.

ప్ర:: ఈ డిసెంబర్‌ 10తో రణ్‌వీర్‌ సింగ్‌ మార్కుకు 10 ఏళ్లు అవుతున్నాయి.  ఈ పదేళ్ల కాలాన్ని వెనక్కి చూసుకుంటే వీటిలో కెరీర్‌పరంగా గొప్ప మైలురాయి ఏదని భావిస్తున్నారు, ఎందుకు అలా భావిస్తున్నారు?

నిజం చెప్పాలంటే నా జీవితంలో అతి పెద్ద మైలురాయి, మొదటి చిత్రానికి సెలక్ట్‌ కావడమే. ఆ క్షణాన్ని అంతా సులభంగా మర్చిపోలేను. ఆ క్షణాన్ని గుర్తు చేసుకుంటే ఇప్పటికీ నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. నాలాంటి నేపథ్యం నుంచి వచ్చినవారు ఈ స్థాయికి చేరడమన్నది కలకు కూడా అందని ఊహ. ఆ కలలన్నీ నిజమయ్యాయి. నటుడిగా, పబ్లిక్‌ ఫిగర్‌గా, సృజనాత్మక వ్యక్తిగా  నేర్చుకోవడం, ఎదగడం, అభివృద్ధి అంతా కూడా విధి ఆడిన నాటకంలో భాగమే. సంవత్సరం గడుస్తున్న కొద్ది, చేస్తున్న ప్రతీ సినిమా ద్వారా ఈ కళ గురించి ఏదో ఒకటి నేను నేర్చుకుంటూనే ఉన్నాను. నా గురించి తెలుసుకుంటూ నా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ప్రతీ సినిమాతో, ప్రతీ పాత్రతో నన్ను నేను అన్వేషించుకోవాలని ఆశిస్తాను. ఈ ప్రయాణంలో కలుసుకున్న ప్రతీ ఒక్కరు నన్ను బాగా అర్థం చేసుకొని ఉంటారని భావిస్తున్నా. ప్రతీ అనుభవం, ప్రతీ సినిమా నన్ను సుసంపన్నం చేసింది. ప్రతీ ఒక్కరికి, ప్రతీ అవకాశానికి నేను సర్వదా కృతజ్ఞుడినై ఉంటాను.

ప్ర: మీరు సొంతంగా సూపర్‌స్టార్‌గా ఎదిగారు, బీబీబీకి ముందు మీరు అనేక తిరస్కరణలు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని అనురాగ్‌ కశ్యప్‌, నిఖిల్‌ అడ్వాణీ వంటి వారు ఈ మధ్యే గుర్తు చేసుకున్నారు. ఆ అనిశ్చిత సమయం నుంచి నేడు ఈ స్థితికి ఎదిగిన క్రమంలో కాలం గురించి మీరేం చెప్తారు?

నేను ఎదుర్కొన్న సంఘర్షణ అంత సులభమైనది కాదు.  ఆ సమయంలో మాంద్యం కారణంగా  సినిమా వ్యాపారం అంతా ఫలప్రదంగా లేదు. జనాలు కూడా సినిమాలు తక్కువ చూసేవారు. కాబట్టి, నేటితో పోల్చితే ఆ రోజుల్లో నటులకు అవకాశాలు కూడా చాలా తక్కువే లభించేవి. మాకు వెబ్‌ వేదికలు, ఓటీటీ వేదికలు లేవు. మంచి అవకాశాలు చాలా అరుదుగా వచ్చేవి. మొదటి మూడు, మూడున్నర సంవత్సరాలు నా పోర్టుఫోలియో పట్టుకొని ప్రతీ ఆఫీసు చుట్టు తిరిగాను. పని కోసం పడరాని పాట్లు పడుతూ చీకట్లోనే మగ్గిపోయాను. ప్రముఖ హిందీ సినిమాల్లో కీలక పాత్రలు పోషించే అవకాశం నాకు దొరుకుతుందనే ఆలోచన కూడా అప్పట్లో కలుగకపోయేది. అయినప్పటికీ నేను శ్రమించాను. నా తల్లిదండ్రుల ప్రేమ, ఆశీర్వదాలు, త్యాగాలు, చేయూతతో నిలదొక్కుకునేందుకు నేను ప్రయత్నించాను. చాలాసార్లు ఆకలితో తల్లడిల్లాను, కొన్నిసార్లు తెలివితక్కువగా వ్యవహరించాను, ఏది ఏమైనా నేను పట్టుదలగా ఉన్నాను.  నేను ప్రయత్నాలు ప్రారంభించినప్పుడు నా వయస్సు 21, నాకు అద్భుతమైన అవకాశం వచ్చింది 24లో.  ఆ కథలన్నీ చెరిగిపోని జ్ఞాపకాలే. పటియాల హౌస్‌ చిత్రంలో ఓ చిన్నపాత్రతో నేను తెరంగేట్రం చేసేవాడినే. అనురాగ్‌ ప్రత్యక్షంగా/పరోక్షంగా రూపొందిస్తున్న చిన్న బడ్జెట్‌ చిత్రాల్లో కూడా దాదాపుగా నేను నటించాను. సంఘటనలు ఎలా మొదలయ్యాయో, ఇప్పుడు ఎలా ముందుకు సాగుతున్నానో చూస్తే అనురాగ్‌ సర్‌, నిఖిల్‌ సర్‌ బహుశా ఆశ్చర్యపోతారేమో.

ప్ర: ఇవాళ టాప్‌ డైరెక్టర్లందరికీ ఫేవరేట్‌ మీరు.  బీబీబీ చేసేటప్పుడు ఈ స్థాయి విజయాన్ని దశాబ్దకాలంలో సాధించగలనని అనుకున్నారా?

లేదు, అసలు అనుకోలేదు. నా తొలి చిత్రం విడుదలైనప్పుడు నాకు జరిగిన సంఘటనలు, కెరీర్‌లో ఎదుర్కొన్న దెబ్బలు, నా ఈ ప్రయాణమూ ఏది నేను కల్లో కూడా ఊహించలేదు. నాకు జరిగిన, నాతో జరిగిన, నా చుట్టుపక్కల జరిగిన విషయాలేవి కూడా నేను కలగనలేదు. ఇలాంటిది జరుగుతుందని ఊహించే దృష్టి నాకు లేదు.  ఏదో ఒకటి జరిగిపోతుందని నేను అనుకున్నాను, ఇలా జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. గొప్ప కలలు కనమని చెప్తారు, కాని నేనేప్పుడు అలాంటి కలగనలేదు. ఇవాళ నేను ఉన్న స్థితిని చూసుకుంటే నాకంతా అవాస్తవంగానే అనిపిస్తుంది.

ప్ర: వారసత్వం గురించి అతిగా ఆలోచించే వ్యక్తుల్లో మీరు ఒకరా? అదే అయితే భారతీయ చిత్రరంగ చరిత్రలో రణ్‌వీర్‌ వారసత్వంగా ఏం ఉండాలని కోరుకుంటున్నారు?

అవును. నాదైన ముద్ర ఉండేలా ప్రతీరోజు నేను కష్టపడుతున్నాను. నేను గర్వపడేలా నా చిత్రాలు ఉండాలన్నది నా కోరిక. కళారంగానికి నేను గణనీయ తోడ్పాటు అందించడమే కాదు, నా సీనియర్లు నాకు ఎలాగైతే ప్రేరణగా నిలిచారో ఇతర కళాకారులకు నేనూ ప్రేరణగా నిలవాలని కోరుకుంటున్నాను. చరిత్ర అందరినీ ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలన్నది మా ఆకాంక్ష. ఈ రంగంలోని మనుషులకు ఇదే సహజమే. నేను చేసే సినిమాలు దేశంలోనే ఉత్తమమైనవిగా నిలిచిపోవాలని. గొప్ప ఎంటర్‌టైనర్‌గా, ఒక వైవిధ్యభరితమైన నటుడిగా గుర్తుండిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఇవన్నీ గొప్ప లక్ష్యాలు. నేను ఎంచుకున్న రంగం అంటే హిందీ చిత్రసీమలో పనిచేయడం ద్వారా నా దేశాన్ని గర్వంగా నిలబెట్టేందుకు నేను ప్రతీ రోజు నా వంతు కృషి చేస్తున్నాను. నా లక్ష్యాన్ని ఇంకా వివరంగా చెప్పాలంటే ప్రజలకు కేవలం వినోదాన్ని అందించాలన్నది నా అభిమతం. మనుగడ కోసం శ్రమించే వారి కష్టాలను తగ్గించి  కొంత మానసిక ఉపశమనాన్నిఅందించాలని నేను భావిస్తాను. దేవుడు నాకు దారి చూపుతున్నాడని, నా విధిరాతను నేను నిర్వర్తిస్తున్నాని నేను నమ్ముతున్నాను.

More Related Stories