మహేష్ బాబు బిగ్ బ్రదర్ అంటున్న రణ్ వీర్ సింగ్Ranveer Singh Mahesh Babu
2020-12-27 00:39:29

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదేమైనా సినిమా షూటా అనుకుంటున్నారా కాదండీ..యాడ్ షూట్ కోసం వీరిద్దరు ఒక్కటైయ్యారట. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన మహేశ్ బాబుతో కలసి ఉన్న ఫోటోని జత చేశాడు రణ్ వీర్ సింగ్. మహేష్ బాబు ఒక జెంటిల్ మ్యాన్ అని.. అతనితో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉందంటూ రణ్ వీర్ పోస్ట్ చేశాడు. అంతేకాకుండా మహేష్ బాబుని ‘బిగ్ బ్రదర్’ అని సంబోధిస్తూ మహేష్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు రణ్ వీర్ సింగ్. దీనికి ఇన్స్టాగ్రామ్ లో రిప్లై ఇచ్చిన మహేష్.. నీతో కలిసి వర్క్ చేయడం బాగుందని.. ఇద్దరికీ ఒకే ఫీలింగ్ అని పోస్ట్ పెట్టాడు. సూపర్ కదా వీరిద్దరు అంటున్నారు నెటిజన్స్.

More Related Stories