శంకర్ కు మరో షాక్..హిందీ రీమేక్ అపాలంటున్న అపరిచితుడు నిర్మాతRanveer Singh
2021-04-15 21:56:57

ప్రముఖ నిర్మాత శంకర్ కు ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తుంది. ఇప్పటికే ఆయన దర్శకత్వం వహిస్తున్న ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం తో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. దాంతో సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే తిరిగి ఈ సినిమా షూటింగ్ ను మళ్ళీ షురూ చేయలేదు. అయితే ఇప్పటికే అనుకున్న బడ్జెట్ లో సగం బడ్జెట్ ఖర్చయ్యిందని దర్శకుడు శంకర్ ఇప్పుడు షూటింగ్ ప్రారంభించడం లేదని చిత్ర నిర్మాణ సంస్థ కోర్టును ఆశ్రయింది. ప్రస్థుతం ఈ కేసు కోర్టులోనే ఉంది. ఇదిలా ఉండగానే శంకర్ కు మరో షాక్ తగిలింది. 

బుధవారం బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో అపరిచితుడు సినిమా రీమేక్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఆ సినిమా హిందీ రైట్స్ కూడా తన సొంతమేనని చిత్ర నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ శంకర్ కు లెటర్ పంపించారు. అపరిచితుడు కథ కు సంబందించిన పూర్తి హక్కులను తాను రచయిత సుజాత వద్ద కొనుగోలు చేసినట్టు తెలిపారు. తనకు తెలియకుండా తన కథ తో ఎలా హిందీ రీమేక్ ను అనౌన్స్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాయ్స్ సినిమా ఫ్లాప్ తరవాత అపరిచితుడు సినిమా చేసే అవకాశం ఇచ్చానని..కేవలం తన సపోర్ట్ తోనే సినిమా హిట్ అయిందని అన్నారు. కానీ కనీస విలువలు పాటించకుండా ఇలా చేస్తారని అనుకోలేదంటూ ఫైర్ అయ్యారు. వెంటనే హిందీ రీమేక్ ను ఆపాలని డిమాండ్ చేశారు.

More Related Stories